Gurugram : ఈ కాలంలో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం పెద్ద కష్టం కాదు. కాకపోతే దానికి తగ్గట్టుగా డబ్బు ఉండాలి. డబ్బు లేని వారి పరిస్థితి పై సామెత లాగే ఉంటుంది. ఇక మనదేశంలో రకరకాల వ్యాపారాలు ఊపందుకున్న తర్వాత.. కొత్త కొత్త మిలియనీర్లు పుట్టుకు రావడం ప్రారంభమైంది. సంపాదన అమాంతం పెరగడంతో.. వారు చేసే ప్రతి పని మీడియాలో హైలెట్ అవుతోంది. ఇప్పుడు అలాంటిదే ఒకటి నమోదయింది. ఢిల్లీ పక్కన ఉండే హర్యానా రాష్ట్రంలో గురు గ్రామ్ ప్రాంతం అత్యంత ఖరీదైనది. ఇక్కడ డిఎల్ఎఫ్ కంపెనీ అనేక వెంచర్లను ఏర్పాటు చేసింది. అత్యంత ఖరీదైన గృహాలను నిర్మించింది. దేశంలోనే అత్యంత ఎత్తైన టవర్లు ఇక్కడ ఉన్నాయి. అపార్ట్మెంట్ మాత్రమే కాదు ఇండివిజువల్ హోమ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఐటీ రంగంలో పనిచేసేవారు, ఫార్మారంగంలో పనిచేసేవారు, స్థిరాస్థి రంగంలో పనిచేసేవారు, ఎంటర్ పెన్యూర్లు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. వారి సంపాదన కూడా అధికంగా ఉంటుంది. అందువల్లే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి ఖరీదైన గృహాలను కొనుగోలు చేస్తారు. అయితే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత డిఎల్ఎఫ్ కంపెనీ నిర్మించిన పెంట్ హౌస్ ను కొనుగోలు చేశారు. అయితే దానికి భారీ స్థాయిలో ధర పెట్టి.. సరికొత్త రికార్డు సృష్టించారు. ఇది ప్రస్తుతం స్థిరాస్తి రంగంలోనే కాదు, వ్యాపారంగంలోనూ సంచలనంగా మారింది.
ఏకంగా అన్ని కోట్లు
హర్యాన రాష్ట్రంలోని గురు గ్రామ్ ప్రాంతంలో డిఎల్ఎఫ్ కంపెనీ కామెలియాస్ అనే పేరుతో అపార్ట్మెంట్ నిర్మించింది. ఇందులో టెంట్ హౌస్ కూడా ఉంది. ఇది మొత్తం 16, 290 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అయితే దీనిని డిఎల్ఎఫ్ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీనికి ఒక స్క్వేర్ ఫీట్ 1.80 లక్షలు గా డిఎల్ఎఫ్ నిర్ణయించింది. అయితే ఇంతటి ధరణి పెట్టి ప్రముఖ ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ రిషి పార్తీ కొనుగోలు చేశారు.. మొత్తంగా 16,290 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం గల అపార్ట్మెంట్ కు మొత్తంగా 190 కోట్లు ఖర్చయింది. 190 కోట్లు పెట్టి రిషి దీనిని కొనుగోలు చేశారు. అయితే కార్పొరేట్ ఏరియాలో ఇతర అత్యధికమని తెలుస్తోంది. ముంబై మహానగరంలో స్క్వేర్ ఫీట్ 1,62,700 వరకు ఉంది. అయితే దానిని గురు గ్రామ్ బీట్ చేసింది. ఏకంగా 1.80 లక్షలకు స్క్వేర్ ఫీట్ ను విక్రయించి రియల్ ఎస్టేట్ మార్కెట్లోని సంచలనం సృష్టించింది. రిషి ఇన్ఫో ఎక్స్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు. కొంతకాలంగా ఆ కంపెనీ అద్భుతమైన ఆదాయాలను నమోదు చేస్తోంది. తనకు కూడా వేతనం, షేర్ల కేటాయింపు ద్వారా భారీగానే డబ్బు వస్తున్న నేపథ్యంలో రిషి ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.కార్పొరేట్ కంపెనీలలో ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇంత స్థాయిలో ఖర్చుపెట్టి అపార్ట్మెంట్ కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. అయితే డిఎల్ఎఫ్ కంపెనీ ఈ అపార్ట్మెంట్ వ్యూ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని 190 కోట్లకు రిషి కొనుగోలు చేశారని పేర్కొంది.