Maruti Suzuki Brezza 2026: Maruti Suzuki కంపెనీ నుంచి ఎక్కువగా సెడాన్, కాంపాక్ట్ కార్లు వస్తాయని చాలామంది భావన. కానీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ కంపెనీ విభిన్న కారులను తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తుంది. సెడాన్ కార్లతో పాటు SUV కార్లను కూడా మార్కెట్లోకి ఇప్పటికే చాలా వరకు తీసుకువచ్చింది. అయితే ఇందులో Brezza గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కారు ఎంతోమందిని ఆకర్షించింది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా దీనిని అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అప్డేట్ అయినా కారు ట్రయల్ చేసేందుకు బయటికి తీసుకురాగా చాలామంది దృష్టిలో పడింది. దీంతో ఈ కారు ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేస్తున్నారు. కొన్ని వర్గాల అంచనాల ప్రకారం ఈ కారు ఎలా ఉండబోతుంది అంటే?
Maruti Suzuki కొత్త Brezza డిజైన్ అయితే వేరే లెవెల్ అని కొందరు అంటున్నారు. ఈ కారు బాహ్య డిజైన్ లో భాగంగా అప్డేట్ చేసిన LED హెడ్ లాంప్స్ ఆకర్షనీయంగా ఉండనున్నాయి. అలాగే కొత్త గ్రిల్, సవరించిన బంపర్లు కారుకు అందాన్ని తీసుకొచ్చాయి. ఫోర్ స్పోక్ అల్లాయి వీల్స్ తో ఇప్పటివరకు ఉన్న గ్రాండ్ విటారా కారును పోలి ఉంటుందని అంటున్నారు. దీంతో గతంలో కంటే ఇప్పుడు కొత్తగా వచ్చే brezza ప్రీమియం లుక్ తో ఆకర్షణీయంగా ఉండనుంది అని అంటున్నారు. ఇందులో ఇంటీరియర్ డిజైన్ కూడా కొంతవరకు మారిపోయింది. అప్డేట్ చేసిన డిస్ప్లే తోపాటు వైర్లెస్, ఆపిల్ అండ్ కార్ ప్లే వంటి ఫీచర్లను కూడా మార్చారు. క్యాబిన్ విశాలంగా ఉండడంతో పాత కారు మాదిరిగానే ఉంటుంది.
ఈ కారు ఇంజన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 103 బిహెచ్పి పవర్తో పాటు 137 nm taark nu రిలీజ్ చేస్తుంది. అలాగే ఇందులో CNG ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. సేఫ్టీ కోసం 360 డిగ్రీ కెమెరా తో పాటు అవసరమైన హెయిర్ బ్యాగ్స్ ను ఇందులో ఉంచారు. దీంతో కారు భద్రత గురించి ఎటువంటి డోకా లేదు అని అంటున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ మార్కెట్లోకి వస్తే రూ.8 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. తక్కువ ధరలో SUV కారు కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.
