Motorola Edge 50 Ultra: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త ఫోన్లను అందిస్తూ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం కెమెరా, బ్యాటరీ విషయంలో చాలామంది ఆసక్తి చూపడంతో ఈ రెండు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా మోటరోలా నుంచి Edge 50 Ultra 5G అనే మొబైల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానంగా నాణ్యమైన కెమెరా ఉండటంతో పాటు.. బలమైన బ్యాటరీ ఉంది. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా బడ్జెట్ లోనే ఇది అందుబాటులో ఉండడంతో ఈ మొబైల్ కొనడానికి మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Motorola Edge 50 Ultra 5G కొత్త మొబైల్లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 200 Mp మెయిన్ కెమెరాను అమర్చారు.50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా పనిచేయనుంది. 8k వీడియోలు తీసుకునే అవకాశం కూడా ఉంది.64 Mp టెలిస్కోప్ స్నాప్స్ ను తీసుకోవచ్చు. దీంతో ఫోటోగ్రఫీ కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఫోన్ అని అనుకోవచ్చు. అలాగే ఇందులో బలమైన బ్యాటరీ చర్చారు. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీని ఉంచారు. ఇది 120 W ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేయనుంది. రోజంతా బిజీగా ఉండే వారికి తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఈ బ్యాటరీ ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. 20 నిమిషాల్లోనే 100% వరకు చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6.8 AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 125 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. 1.5 K resolution తో నాణ్యమైన వీడియోలను చూడవచ్చు. అంతేకాకుండా గేమింగ్ కోరుకునే వారికి కూడా ఇది ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. ఒకేసారి వివిధ రకాల యాప్స్ ను ఉపయోగించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో 8జెన్ 3 ప్రాసెసర్ను అమర్చడంతో.. మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. కర్వుడు డిజైన్తో ఆకట్టుకునే ఈ మొబైల్ లో 12 GB రామ్,256 స్టోరేజ్ని సెట్ చేశారు. దీంతో ఫోటోలు, కావలసిన వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు.
ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ చాలా వరకు ధర ఉంటుందని అనుకుంటారు. కానీ దీనిని రూ.9,300 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావలసిన ఫోన్ కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
