Maruti Suzuki: సొంత ఇల్లు తో పాటు సొంత కారు ఉండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే కారు విషయంలో కొంతమంది ధర తక్కువగా ఉండాలని అనుకుంటారు. ఇలాంటి వారికి అనుగుణంగా Maruti Suzuki కంపెనీ నుంచి అనేక మోడల్స్ ఇప్పటికే వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే ఇందులో కొన్ని మోడల్స్ ఇప్పటికి ఎవరు గ్రీన్ గా నిలిచాయి. వాటిలో Alto K10 కారు ఒకటి. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండి.. అతి తక్కువ ధరలో లభించే ఈ కారు ఇప్పుడు అప్డేట్ అయి మార్కెట్లోకి వచ్చింది. అయితే కొత్తగా వచ్చిన ఈ కారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మారుతి ఆల్టో కే 10 2025 కారు మార్కెట్లోకి వచ్చింది. ఇది గతంలో ఉన్న కారు కంటే ఆకర్షణీయమైన డిజైన్తో పాటు.. మెరుగైన పనితీరును కనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆటోమొబైల్ ప్రతినిధులు అంటున్నారు. సులభమైన డ్రైవింగ్ అందించే ఇది కొత్తగా కారు కొనేవారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి కూడా సహకరిస్తుంది. ఈ కారు బాహ్య ఫీచర్స్ పరిశీలిస్తే.. ఆధునిక గ్రిల్, పదునైన హెడ్ లాంప్, స్టైలిష్ టెయిల్ లాంపు ఉన్నాయి. కొత్త వీల్ కవర్లు స్పోర్ట్స్ కార్ లెవెల్ లో కనిపిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్ టైట్ సిటీ ఆకర్షణీయంగా ఉంది. బాడీ కలర్ ప్రీమియర్ టచ్ ను చేస్తున్నాయి.
ఈ మోడల్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది 67 PS పవర్ ను ఇస్తూ..89 NM టార్కును రిలీజ్ చేస్తుంది.5 స్పీడ్ మాన్యువల్, ఆటోమోటివ్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంది. దీంతో నగరాల్లో ప్రయాణం చేసే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే ఇందులో ఉండే ఇన్నర్ ఫీచర్స్ కూడా ఆపట్టుకునేలా ఉన్నాయి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఆటో, ఆపిల్ కార్ ప్లే తో పాటు విశాలమైన క్యాబిన్ తో సౌకర్యంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బెస్ట్ సేఫ్టీ ని అందిస్తాయి. అలాగే మెరుగైన సీటింగ్, తగిన క్యాబిన్ ఉండడంతో లాంగ్ డ్రైవ్ చేసే వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది.
Alto K10 2025 కారు ధర రూ.4.23 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే CNG వేరియంట్ కావాలంటే ధర మారే అవకాశం ఉంటుంది. నగర వాసులతోపాటు దూర ప్రయాణాలు చేసేవారు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.