https://oktelugu.com/

Gold Prices: పెళ్లిళ్లు చేసుకునేవారికి షాక్ ఇచ్చిన బులియన్ మార్కెట్..

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 3న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.64,090 గా ఉంది. జనవరి 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,550తో విక్రయించారు.

Written By: , Updated On : January 3, 2024 / 09:23 AM IST
Gold Prices Today

Gold Prices Today

Follow us on

Gold Prices: మంచిరోజుల కారణంగా పెళ్లిళ్లు జోరందుకున్నాయి. అలాగే చాలా మంది శుభకార్యాలు నిర్వహించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. ప్రధానంగా పెళ్లిళ్లు చేసుకునేవారికి బంగారం కొనుగోలు తప్పనిసరి. ఇలాంటి సమయంలో బంగారం ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. నిన్నా మొన్నా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 2063 డాలర్ల వద్ద నమోదైంది. స్పాట్ సిల్వర్ ధర 23.68 డాలర్లు ట్రేడ్ అవుతోంది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 3న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.64,090 గా ఉంది. జనవరి 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,550తో విక్రయించారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.64,240గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.64,090 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.59,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,580తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,090తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,750తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,090తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,900గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరలు రూ.300 మేరకు పెరిగాయి. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.78,900గా ఉంది. ముంబైలో రూ.78,900, చెన్నైలో రూ.80,300, బెంగుళూరులో 76,500, హైదరాబాద్ లో రూ.80,300తో విక్రయిస్తున్నారు.