Brand : కొన్ని కార్లలో తిరిగిన అనుభవం వేరే ఉంటుంది. ఇలాంటి కారు మనకు కూడా ఉంటే బాగుండు.. అని అనిపిస్తుంది. ఒకప్పుడు కొంత మంది ఇళ్లల్లో మాత్రమే కార్లు ఉండేవి. అలా కారు ఇంట్లో ఉంటే వారు ధనవంతులన్నట్లే.. అయితే కాలం మారుతున్న కొద్దీ మార్కెట్లోకి కొత్త కార్లు వచ్చాయి. కానీ ఒకప్పుడు రారాజుగా ఉన్న బ్రాండ్ కార్లు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పాత మోడళ్లను నేటి కాలానికి అనుగుణంగా మార్చి వినియోగదారులను ఆకర్షించారు. ఇప్పుడు మరో కారును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాంటి కార్లలో ఈ ‘బ్రాండ్’ కారు గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
‘బ్రాండ్’ అని పేరు చెప్పగానే.. ఎక్కువగా గుర్తుకు వచ్చేది.. అంబాసిడర్ కారు. 1957 తరువాత ఇళ్లల్లో కనిపించిన అంబాసిడర్ కారు ఓ వెలుగు వెలిగింది. ఈ కారులో ప్రయాణించిన వారి అనుభూతిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ కాలంలో ఈ కారు ఉంటే వారిని ధన వంతుల కింద లెక్కగట్టేవారు.అయితే కొన్ని కారణాల వల్ల దీనిని 2014లో ఉత్పత్తిని నిలిపివేశారు. మార్కెట్లోకి కొత్త కార్లు రావడం.. నేటి అభిరుచులకు అనుగుణంగా అంబాసిడర్ కారు లేకపోవడంతో దీనిని తీసుకురాలేదు.
Also Read : మరీ ఇంత చీప్ గా బ్రాండ్ కార్లు.. అదిరిపోయే ఆఫర్స్ గురూ..
అయితే ఈ కారును ఆధునీకరించి కొత్త మోడల్ లో తీసుకొస్తున్నారన్న విషయం ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎప్పుడా? అని ఎదురుచూసేవారికి ‘ప్రెంచ్ కార్ల కంపెనీ’ గుడ్ న్యూస చెపపింది. ఈ గ్రూప్ లో కొన్ని కార్ల కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ గ్రూప్ ఆధ్వర్ంలో బ్రాండ్ అంబాసిడర్ ను తిరిగి తీసుకురావడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్ లో అంబాసిడర్ కారును కేవలం వాహనంగానే కాకుండా సెంటిమెంట్ కారుగా కూడా భావిస్తారు. ఇలాంటి తరుణంలో ఈ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
2026 మార్చిలో ఈ కారు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలాగే ఈ కారును రూ.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయించాలని చూస్తున్నారు. దీంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం ఈ కారును కొనేందుకు అందుబాటులో ఉంటుందన్న మాట. ఈ కారు మార్కెట్లోకి వస్తే మిగతా కార్లకు గట్టి పోటీ ఉంటుందని ఇప్పటికే ఆటోమోబైల్ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ సాగుతోంది. అయితే ఈ కారు ఫీచర్లు, వేరియంట్ గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ ఇది ఎస్ యూవీ వేరింట్ లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడున్న ట్రెండ్ కు అనుగుణంగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో వస్తుందా? లేదా పెట్రోల్ ఇంధనంతో ఉంటుందా? అనేది చూడాలి.
అయితే చాలా పాత అంబాసిడర్ లో అనుభవం ఉన్న వారు కొత్త కారు ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరోవైపు కొత్తగా కార్లు కొనాలని అనుకునేవారు.. దీని వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో కారును ఇండియాలోనే లాంచ్ చేయాలని ప్రెంచ్ కార్ల కంపెనీ భావిస్తోంది.
Also Read : భారత్ లో అమ్ముడయ్యే టాప్ లగ్జరీ కార్ బ్రాండ్లు ఇవీ