Tesla Cybertruck Features: ప్రపంచంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన టెస్లా సైబర్‌ట్రక్ ఎట్టకేలకు రోడ్లపైకి వచ్చింది. కొంతమంది కస్టమర్ల చేతుల్లోకి చేరిన ఈ వినూత్న ఎలక్ట్రిక్ ట్రక్, భారతదేశంలో సుమారు రూ.1.30 కోట్ల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఒక భారీ ట్రక్కును పోలి ఉండే ఈ ఎలక్ట్రిక్ వెహికల్, దాని స్పెషల్ డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణ పికప్ ట్రక్కుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.
సైబర్‌ట్రక్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని డిజైన్. దీనిని చూసిన వెంటనే ఇది మామూలు వెహికల్ కాదని అర్థమవుతుంది. దీని బాడీ సాధారణ కార్లలాగా ఫ్రేమ్‌పై ప్యానెళ్లతో కాకుండా, స్ట్రాంగ్ అల్ట్రా-హార్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఎగ్జోస్కెలెటన్‌తో తయారు చేశారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ సేఫ్టీని కూడా అందిస్తుందని టెస్లా చెబుతుంది. చిన్నపాటి దెబ్బలు, డెంట్ల నుండి కూడా ఇది కారును కాపాడుతుంది. ఇది ఫ్యూచరిస్టిక్, యాంగ్యులర్ డిజైన్లో వస్తుంది. కొంతమందికి ఈ డిజైన్ విచిత్రంగా అనిపించినా, దీనికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీకి పెయింటింగ్ అవసరం లేదు. ఇది తుప్పు పట్టకుండా, దీర్ఘకాలికంగా చాలా మన్నికగా ఉంటుంది.
Also Read: Maruti Suzuki Cars: మారుతీ కార్లు కొనాలనుకునే వాళ్లకు షాక్
సైబర్‌ట్రక్ కేవలం డిజైన్‌లోనే కాదు, పర్ఫామెన్స్ లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది మూడు ప్రధాన వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రియర్-వీల్ డ్రైవ్/ సింగిల్ మోటార్ వేరియంట్ సుమారు 589 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 0-60 mph వేగాన్ని 6.2 సెకన్లలో అందుకుంటుంది. అలాగే ఆల్-వీల్ డ్రైవ్/ డ్యూయల్ మోటార్ వేరియంట్ సుమారు 523 కి.మీ. రేంజ్, 0-96 kmph వేగాన్ని 4.1 సెకన్లలో చేరుకుంటుంది. దీని ట్రైలర్ లాగే కెపాసిటీ సుమారు 4,990 కిలోలు. సైబర్‌బీస్ట్ / ట్రై-మోటార్ వేరియంట్ సుమారు 515 కి.మీ.రేంజ్ ఇస్తుంది, 0-96 kmph వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో (సూపర్ కార్లతో సమానం) అందుకుంటుంది.
ఈ అద్భుతమైన పనితీరును అందించడానికి సైబర్‌ట్రక్ 123 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 325 kW వరకు సూపర్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. కేవలం 15 నిమిషాల్లో 135 మైళ్ల వరకు రేంజ్ పొందవచ్చు. సైబర్‌ట్రక్ లోపల కూడా అడ్వాన్సుడ్ టెక్నాలజీతో నిండి ఉంది. డ్రైవర్ కోసం 18.5-అంగుళాల సెంటర్ టచ్‌స్క్రీన్, వెనుక ప్రయాణీకుల కోసం 9.4-అంగుళాల వెనుక టచ్‌స్క్రీన్ ఉన్నాయి. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. 15-స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్ ఉంటుంది. మల్టీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ సైబర్ ట్రక్ వేరే వెహికల్స్ కు కూడా ఛార్జింగ్ అందించే సదుపాయం ఉంది. టెస్లాలో ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తి ఆటోమేటిక్ డ్రైవింగ్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌తో ఇది వస్తుంది.