Reliance Jio : ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం గొప్ప దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ ఆఫర్ 90 రోజులు, 365 రోజుల జియో ప్లాన్‌లతో అందించబడుతోంది. రిలయన్స్ జియో నుండి దీపావళి ఆఫర్ కింద రూ. 3350 ప్రయోజనం పొందవచ్చచు. ఈ ఆఫర్‌ను ఏ ప్లాన్‌లతో పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ సిమ్ ఉంటే జియో 899 ప్లాన్, జియో 3599 ప్లాన్ ల మీద ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌లతో, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు, ట్రావెల్ పోర్టల్‌లు, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లకు కూపన్లు అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు ప్లాన్‌లతో రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్(EaseMyTrip), రూ. 200 విలువైన అజియో(AJIO), రూ. 150 విలువైన స్విగ్గీ(Swiggy) వోచర్లను కంపెనీ ఇవ్వనుంది. విమానం, హోటల్ బుకింగ్ కోసం ఈజ్ మై ట్రిప్ నుండి రూ. 3,000 వోచర్‌ను ఉపయోగించవచ్చు. అజియో నుండి కొత్త బట్టలు కొనుగోలు చేసేటప్పుడు రూ. 200 వోచర్‌ను ఉపయోగించుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అంతే కాకుండా స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.150 కూపన్ అప్లై చేయడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
జియో 899 ప్లాన్ వివరాలు
రూ. 899 ఈ ప్లాన్‌తో వినియోగదారులకు నిజమైన అపరిమిత 5G డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, ఉచిత కాలింగ్, ప్రతిరోజూ 2 జీబీ డేటా, 90 రోజుల చెల్లుబాటుతో 20 జీబీ ఎక్స్ ట్రా డేటా ఇవ్వబడుతుంది.
జియో 3599 ప్లాన్ వివరాలు
3599 రూపాయల ఈ ప్లాన్‌తో, మీరు 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లను పొందుతారు. రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో జియో సినిమా, జియో టీవీ , జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్‌ను కూడా పొందవచ్చు.
రీఛార్జ్ తర్వాత కూపన్లు ఎలా పొందాలి?
రీఛార్జ్ చేసిన తర్వాత MyJio యాప్‌ని ఓపెన్ చేసి My Offers విభాగానికి వెళ్లి My Winnings ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ చేయగల మూడు కంపెనీల వోచర్ కోడ్‌లను చూడవచ్చు. వాటి సాయంతో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు, ట్రావెల్ పోర్టల్‌లు, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసేటప్పుడు అప్లై చేసి డిస్కౌంట్ పొందవచ్చు.