https://oktelugu.com/

Tejas BSNL Deal: తేజస్ కంపెనీతో BSNL భారీ ఢీల్.. Jio, Airtel కు భారీ దెబ్బ.. ఇక తక్కువ ధరకే రీఛార్జ్..

ఒకప్పుడు ఎయిర్ టెస్ సిమ్ ల కోసం క్యూ కట్టేవారు.. ఆ తరువాత జియో సిమ్ ల ఎగబడ్డారు. ఇప్పుడు BSNL కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. ఇలా మారిన వారిలో జియో, ఎయిర్ టెల్ నుంచే ఎక్కువగా ఉన్నారు. రీచార్జ్ ధలు పెంచడంతో బీఎస్ ఎన్ ఎల్ కోరుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 26, 2024 1:05 pm
    Tejas BSNL Deal

    Tejas BSNL Deal

    Follow us on

    Tejas BSNL Deal: టెలికం రంగంపై ఇప్పుడు విపరీతమైన చర్చ సాగుతోంది. ఒకప్పుడు అతి తక్కువ ధరకే అత్యధిక స్పీడ్ డేటా అందించిన Jio, Airtel,Vi మొబైల్ సంస్థలు జూలై 3 నుంచి రీఛార్జ్ ధరలు పెంచేశాయి. 28 రోజుల పాటు రీఛార్జ్ ను రూ.299 చెల్లిస్తే రోజకు 1 జీబీ డేటాను అందించి అపరిమిత కాల్స్ అందిస్తున్నాయి. ఇది అందకుముందు రూ.239 మాత్రమే ఉండేది. ఎయిర్ టెల్ కోసం రూ. 209 చెల్లిస్తే 28 రోజుల పాటు ప్రతి రోజూ 1 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడీ ప్లాన్ ను రూ. 249కి పెంచారు. మొత్తంగా రీఛార్జ్ ధరలు 12 నుంచి 25 శాతం పెంచినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ప్రత్యామ్నాయ సర్వీసుల కోసం ఎదురుచూశారు. ఇదే సమయంలో BSNL అపన్న హస్తంలా దొరికింది. దీంతో వెంటనే జియో, ఎయిర్ టెల్ సబ్ స్క్రైబర్లు BSNL కు మారిపోతున్నారు. ఇటీవల తేలిన లెక్క ప్రకారం కొత్తగా 3 లక్షలకు పైగా BSNL ను సబ్ స్క్రైబర్ అయ్యారు. మరో 25 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. రాను రాను ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం BSNL లో కొన్ని లోపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సబ్ స్క్రైబర్లు తాత్కాలికమేనని, కొన్ని రోజుల తరువాత తిరిగి పాత సర్వీసుకు వస్తారని అంటున్నారు. అయితే BSNL ఉండే సమస్యు ఏవి? ఆ తరువాత ఈ కంపెనీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది?

    ఒకప్పుడు ఎయిర్ టెస్ సిమ్ ల కోసం క్యూ కట్టేవారు.. ఆ తరువాత జియో సిమ్ ల ఎగబడ్డారు. ఇప్పుడు BSNL కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. ఇలా మారిన వారిలో జియో, ఎయిర్ టెల్ నుంచే ఎక్కువగా ఉన్నారు. రీచార్జ్ ధలు పెంచడంతో బీఎస్ ఎన్ ఎల్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం BSNL లో నెల పాటు 1 జీబీ డేటాతో కేవలం రూ.108 మాత్రమే చార్జ్ చేస్తుంది. ఇది మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. అయితే BSNL లో ప్రస్తుతం 3 జీ సేవలు మాత్రమే ఉన్నాయి. దీంతో నెట్ స్లో అవుతుంది. ఇప్పటి వరకు 5 జీ వాడిన వారు 3 జీ స్పీడుతో సమస్యలు ఎదుర్కొంటారు.

    ఈ నేపథ్యంలో కొందరు BSNLలో ఉండే సమస్యల గురించి ప్రస్తావించారు. దీంతో BSNL కంపెనీ 4జీ, 5 జీ కోసం తేజస్ నెట్ వర్క్, ఐటీఐ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.19 వేల కోట్లు. ఇందులో రూ.15 వేల కోట్లో షేర్ తేజజ్ నెట్ వర్క్ ది . అంతేకాకుండా ఈ తేజస్ నెట్ వర్క్ ఎవదితో కాదు. పరోక్షంగా రతన్ టాటా కంపెనీది. ఇందులో భాగంగా టాటా కంపెనీ 4జీ, 5జీ తీసుకు రావడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో BSNL నుంచి 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వస్తే జియో, ఎయిర్ టెల్ నుంచి భారీగా మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

    అయితే BSNL అనగానే చాలా మంది ఉండే అభిప్రాయం నెట్ వర్క్ సమస్య ఉంటుందని. కానీ ఇప్పుడు కొత్తగా నెట్ వర్క్ టవర్లు వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మారుమూల గ్రామాల్లోకి సైతం కొత్తగా టవర్లు ఏర్పడితే BSNL నుంచి తక్కువ ధరకే 4జీ, 5జీ డేటాను పొందే అవకాశం ఉంటుంది.