Bitcoin : పెద్దలు చెప్పినట్లు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. అయితే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఇదే జరిగింది. బిట్ కాయిన్ల గురించి అంతగా తెలియని రోజుల్లో.. అంటే ఈ కరెన్సీలు వచ్చిన కొత్తలో ఓ వ్యక్తి తన దగ్గరున్న బిట్ కాయిన్లతో రెండు పిజ్జాలను కొనుగోలు చేశాడు. కానీ ఈ బిట్ కాయిన్ల వాల్యూ ఇప్పుడు కోట్లలో ఉంది. అవే బిట్ కాయిన్లు ఇప్పుడు తన దగ్గర ఉండి ఉంటే.. తను ఇప్పుడు రెండు వేల కోట్లకు పైగా అధిపతి అయ్యే వాడు. కానీ ఆ రోజు పిజ్జాల కోసం కక్కుర్తిపడి వాటిని అమ్ముకున్నాడు. 12 ఏళ్ల బిట్ కాయిన్ పిజ్జా డే అంటూ ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నాడా సదరు టెకీ.
దాదాపు 12సంవత్సరాల క్రితం ఫ్లోరిడియన్‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు పిజ్జా తినాలనిపించింది. రెండు పిజ్జాలను కొనుగోలు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా పిజ్జాలను కొనుగోలు చేశాడు. అయితే ఈ పిజ్జాల కోసం ఆయన బిట్ కాయిన్లను ఉపయోగించాడు. క్రిప్టో కరెన్సీలను వాడుతూ తొలిసారి ప్రపంచంలోనే అత్యంత రికార్డు స్థాయిలో ఈ కొనుగోలును చేపట్టాడు లాస్లో హన్యెక్జ్. కానీ ఇప్పుడు ఆ బిట్ కాయిన్ల ఖరీదు ఏకంగా రూ.2,200 కోట్ల పైమాటే. అసలు 12సంవత్సరాల క్రితం జరిగిన ఆ కథేంటి..? బిట్ కాయిన్ పిజ్జా డేను ఎందుకు హన్యెక్జ్ జరుపుకుంటున్నారో చూద్దాం.
లాస్లో హన్యెక్జ్ 2010 మే 18న రెండు పిజ్జాలను కొనుగోలు చేయాలని అనుకున్నాడు. వాటికి చెల్లింపును బిట్ కాయిన్ రూపంలో చెల్లింపులు చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని బిట్‌కాయిన్ టాక్ డాట్ ఓఆర్‌జీ ఫోరమ్‌లో చెప్పుకొచ్చాడు. ఎవరైతే తనకు ఈ ఆర్డర్ అందిస్తారో వారికి 10 వేల బిట్‌కాయిన్లను చెల్లించనున్నట్లు ఆయన పేర్కొ్న్నాడు. పిజ్జాలను అందించి క్రిప్టో కరెన్సీలను చెల్లింపు పద్ధతిలో తీసుకోవాలని పేర్కొన్నాడు. కానీ అంత త్వరగా ఈ ఆర్డర్ స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రోజుల తరబడి వెయిట్ చేశాడు. ఈ విషయంపై లాస్లో హన్యెక్జ్ ఎంతో బాధపడ్డాడు. ఆశలన్నీ వదులుకున్నాడు. కానీ ఆ తర్వాత అతని ప్రకటనకు ఓ 19 ఏళ్ల జెరెమీ స్టర్డివాంట్ స్పందించాడు.
2010 మే 22న 10 వేల బిట్‌కాయిన్లకు రెండు పిజ్జాలను అందించేందుకు జెరెమీ ఒప్పుకున్నాడు. ఈ పిజ్జాలను డెలివరీ తీసుకున్న తర్వాత హన్యెక్జ్ పిజ్జాలను అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను అప్పట్లో షేర్ చేశాడు కూడా. అప్పట్లో ఆ బిట్ కాయిన్ల ఖరీదు కేవలం 40 డాలర్లు మాత్రమే. అయితే లాస్లో హన్యెక్జ్ ఆ రోజును తలుచుకుని ఇప్పుడు తీవ్రంగా విచారిస్తున్నాడు. ఎందుకంటే ఈ పిజ్జాల కోసం తాను ఖర్చు చేసిన 10 వేల బిట్ కాయిన్ల ఖరీదు ఇప్పుడు రూ.2,260 కోట్లు. ఇప్పుడు అతని చేతిలో ఆ బిట్ కాయిన్లు ఉండుంటే నిజంగా వేల కోట్లకు అధిపతినే. కానీ ఆ రోజు పిజ్జా కోసం కక్కుర్తిపడి ఈ బిట్ కాయిన్లను అమ్మేసుకున్నాడు. బిట్ కాయిన్ ధర ఆల్ టైమ్ గరిష్టాల్లో ఉన్నప్పుడు వాటి ధర రూ.5,175 కోట్లు. చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం అన్నట్లుగా ఉంది ఈ టెకీ పరిస్థితి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Techie pays 10000 bitcoins for two pizzas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com