Homeబిజినెస్Google- Facebook: ఏమిటి ఓఐడీఏఆర్? గూగుల్, మెటా, ఎక్స్ ఎందుకు భయపడుతున్నాయి?

Google- Facebook: ఏమిటి ఓఐడీఏఆర్? గూగుల్, మెటా, ఎక్స్ ఎందుకు భయపడుతున్నాయి?

Google- Facebook: ఇన్నాళ్లు అవి వ్యాపారం బాగానే చేసుకున్నాయి. వేల కోట్లను వెనకేసుకున్నాయి. ఇక్కడ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులను సొంత దేశంలో పెట్టుబడులుగా పెట్టాయి. మన వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయని ఆలోచనతో ఇక్కడి ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చాయి. ఆ సంస్థలు కూడా ఆకాశాన్ని తల దన్నే విధంగా భవనాలు నిర్మించాయి. ఒక్క ఆర్థిక మాంద్యం చోటు చేసుకోవడంతో రైతులు పొందామన్న విశ్వాసం కూడా లేకుండా మన ప్రాంతానికి చెందిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేసాయి. అయినప్పటికీ ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి పరిణామం కేంద్ర ప్రభుత్వానికి చిరాకు తెప్పించింది. లక్షల కోట్ల క్యాపిటల్ వాల్యూ ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఇలా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వాటిని తెలివిగా దెబ్బకొట్టేందుకు కొత్త ఎత్తుగడవేసింది. ఫలితంగా ఆ కంపెనీలు కేంద్రానికి పన్నులు చెల్లించాల్సిందే.

భారత్ కేంద్రంగా మెటా, ఎక్స్, గూగుల్, కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అమెరికా వెలుపల ఈ కార్పొరేట్ కంపెనీలకు భారత్ నుంచే అధికంగా ఆదాయం వస్తున్నది. అయితే ఏ దేశంలో లేని సౌకర్యాలు భారత్ లో మాత్రమే ఉండటంతో ఇక్కడ ఈ సంస్థలు భారీగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అమెరికాతో పోల్చుకుంటే చవకగా మానవ వనరులు, ప్రభుత్వ రాయితీలు అందుతుండడంతో ఈ కంపెనీలు అంతకంతకు లాభాలు గడిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా పలు రకాల పన్నులు వేయకుండా ఇన్నాళ్లు ఊరట కల్పించింది. ఈ కార్పొరేట్ కంపెనీలపై ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ పేరుతో 18 శాతం టాక్స్ వసూలు చేయాలని భావిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ, పలు నివేదికలు చెబుతున్న సమాచారం ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్స్ అండ్ కస్టమ్స్ విభాగం ఐజీఎస్టీ నుంచి ఓఐడీఆర్ సంస్థలకు ఇకపై మినహాయింపు ఇవ్వబోదని సమాచారం. అక్టోబర్ నుంచి భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అడ్వర్టైజింగ్, క్లౌడ్ సర్వీస్, మ్యూజిక్, సబ్ స్క్రిప్షన్ సర్వీసులు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తున్న ఆయా కంపెనీల నుంచి కేంద్ర ప్రభుత్వం ఐ జీఎస్టీ ని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు దేశంలో ఓఐడీఆర్ సంస్థలు ఎలాంటి టాక్స్ చెల్లించే పనిలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు పన్ను నుంచి మినహాయింపులు ఇస్తున్నాయి. కేవలం, బిజినెస్ టు బిజినెస్ సర్వీసులు అందించే కంపెనీలు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నాయి. రాజాగా కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం తీసుకున్న నిర్ణయంతో ఓఐడీఆర్ సంస్థలైనటువంటి మెటా, ఎక్స్, గూగుల్ వంటి సంస్థల మీద పన్ను భారం పడే అవకాశం ఉంది. దీంతో ఈ కార్పొరేట్ దిగ్గజాలు ఆందోళన చెందుతున్నాయి. మరో దేశమైతే ఇలా పన్నులు వేస్తే ఈ కార్పొరేట్ కంపెనీలు అక్కడి నుంచి వెళ్లిపోయేవి. అయితే భారత్ అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం కావడంతో ఈ కంపెనీలు కిక్కురుమనడం లేదు.

ఓఐడీఆర్ అంటే ..

ఓఐడీఆర్ ని ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రివల్ సర్వీసెస్ అని పిలుస్తారు. భాగంలో సేవలు అందించే సంస్థలు లేదా వ్యక్తులకు వినియోగదారులతో ఎటువంటి భౌతిక సంబంధం ఉండదు. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇవి వినియోగదారుల అవసరాలు తీర్చుతాయి. గూగుల్, మెటా, ఎక్స్ తో పాటు ఆన్ లైన్ ద్వారా వినియోగదారుల అవసరాలు తీర్చే కంపెనీలు మొత్తం ఓఐడీఆర్ విభాగం కిందకే వస్తాయి. ఇక ప్రభుత్వం 18 శాతం పన్ను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడంతో ఈ కార్పొరేట్ కంపెనీలు భయపడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version