https://oktelugu.com/

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఇకపై డబుల్ టీడీఎస్..?

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు భారీ షాక్ ఇచ్చింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు వచ్చే నెల నుంచి ఎక్కువ మొత్తంలో టీడీఎస్ ను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన రెండు సంవత్సరాలలో టీడీఎస్ ను చెల్లించని వారు ప్రతి సంవత్సరం టీడీఎస్ రూ.50 వేలు దాటితే జులై 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను శాఖ రిటర్నులను దాఖలు చేస్తే ఎక్కువ మొత్తం ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ 2021 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 206ఏబీని […]

Written By: , Updated On : June 12, 2021 / 06:06 PM IST
Follow us on

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు భారీ షాక్ ఇచ్చింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు వచ్చే నెల నుంచి ఎక్కువ మొత్తంలో టీడీఎస్ ను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన రెండు సంవత్సరాలలో టీడీఎస్ ను చెల్లించని వారు ప్రతి సంవత్సరం టీడీఎస్ రూ.50 వేలు దాటితే జులై 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను శాఖ రిటర్నులను దాఖలు చేస్తే ఎక్కువ మొత్తం ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

బడ్జెట్ 2021 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 206ఏబీని అమలులోకి తెచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం కొంత మంది పన్ను చెల్లింపుదారులపై ప్రతికూల ప్రభావం పడనుందని వీళ్లు సాధారణంగా చెల్లించాల్సిన టీడీఎస్ తో పోలిస్తే డబుల్ టీడీఎస్ ను చెల్లించాల్సి రావచ్చని సమాచారం. వచ్చే నెల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.

మరోవైపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరే విధంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే పొడిగించిన గడువు వర్తిస్తుందని సమాచారం. నాలుగో త్రైమాసికానికి సంబంధించి టీడీఎస్ దాఖలు చేయడానికి జూన్ నెల 30వ తేదీ చివరి తేదీగా ఉండటం గమనార్హం. మరోవైపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

సరికొత్త ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌ను, కొత్త పోర్టల్ మొబైల్ యాప్ ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. కొత్త పోర్టల్ ద్వారా వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడంతో పాటు వేగంగా రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. కొత్త ఈ ఫైలింగ్ వెబ్ సైట్ అందువాటులోకి రావడం వల్ల స్మార్ట్‌ఫోన్ ద్వారానే పలు రకాల సర్వీసులు పొందొచ్చు.