Homeబిజినెస్Tata Tiago EV: బడ్జెట్ తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బెస్ట్...

Tata Tiago EV: బడ్జెట్ తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బెస్ట్ కారు ఇదే..

Tata Tiago EV: మిడిల్ క్లాస్ పీపుల్స్ కారు కొనాలని అనుకుంటే ముందుగా ఆలోచించేది బడ్జెట్ గురించే. తక్కువ ధరలో మంచి కారు కొనాలని అనుకుంటారు. ఆ తర్వాత మైలేజ్ గురించి ఆలోచిస్తారు. అయితే కొన్ని కార్లు బడ్జెట్లో అందుబాటులో ఉంటే మైలేజ్ విషయంలో తక్కువగా ఉంటుంది. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్లు బడ్జెట్ కు అనుగుణంగా ఉండవు. కానీ ఈ రెండు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండే విధంగా ఓ కారు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటుంది. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. ఇంతకీ ఇది ఏ కారు? మైలేజ్ ఎంత ఇస్తుంది? ధర ఎంత?

దేశంలో టాప్ టు గా పేరు తెచ్చుకున్న TATA కంపెనీ గురించి తెలియని వారు ఉండరు. ఈ కంపెనీ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా లేటెస్ట్ గా Tata Tiago EV మార్కెట్లోకి వచ్చింది. అయితే దీనికి మరింతగా మెరుగులు దిద్ది ఫేస్ లిఫ్ట్ గా రాబోతుంది. ఇందులో ప్రధానంగా ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ ఆడియో, టచ్ స్క్రీన్ ఇంపార్టైన్మెంట్ సిస్టం, సన్ రూప్ వంటి సదుపాయాలు ఇందులో కనిపిస్తాయి. వీటిలో సన్రూఫ్ ప్రీమియం కార్లలో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా దీనిలో ప్రవేశపెట్టారు.

సేఫ్టీ లోను టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ కారు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. డిజైన్ పరంగా కూడా ఆకట్టుకునే విధంగా ఉండనుంది. ఇందులో ఎల్ ఈ డి లైట్స్, రీ డిజైన్ చేసిన బంపర్లు కారుకు అందాన్ని తీసుకువచ్చాయి. ఈ కారులో రెండు రకాల బ్యాటరీలు చూడవచ్చు. ఇప్పటివరకు టాటా టియాగో టీవీలో 19.2 kWh, 24 kWh అనే రెండు బ్యాటరీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే ఫేస్ లిఫ్టులో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బ్యాటరీలు సింగిల్ ఛార్జింగ్ పై 300 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ప్రీమియం కార్ల ఫీచర్లు ఉన్నప్పటికీ.. దీని ధర మాత్రం తక్కువగానే నిర్ణయించారు. టాటా టియాగో ఇవి రూ.7.99 లక్షలు ఉండగా.. ఫేస్ లిఫ్ట్ కూడా అంతే ధరలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ధరలు కూడా తగ్గించారు.. వాటికి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు కొనుగోలు చేసేటప్పుడు battery as a Service ఆప్షన్ ఉంటే తక్కువ ధరతోనే కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular