spot_img
Homeబిజినెస్Tata Nexon price under 8 lakh: ప్రీమియం లుక్.. స్మార్ట్ ఫీచర్లు.. కానీ ధర...

Tata Nexon price under 8 lakh: ప్రీమియం లుక్.. స్మార్ట్ ఫీచర్లు.. కానీ ధర రూ.8 లక్షల లోపే..

Tata Nexon price under 8 lakh: దేశంలో కార్ల విక్రయాల్లో రెండో స్థానంలో నిలిచిన Tata కంపెనీ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా వెహికల్స్ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే 2026 కొత్త సంవత్సర సందర్భంగా ప్రీమియం డిజైన్ తోపాటు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త కారును రిలీజ్ చేసింది. ఈ కారులో ఉండే పెట్రోల్ తో పాటు సిఎన్జి ఆప్షన్ తో మైలేజ్ సపోర్ట్ గా నిలుస్తుంది. అంతేకాక ఇందులో ఉండే ఇంజన్ పనితీరు కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఇంతకీ ఇది ఏ కారు? ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్లు ఏంటి?

కాంపాక్ట్ SUV విభాగంలో TATA కంపెనీ నుంచి Nexon ఆటోమోబైల్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ కారు చూడడానికి స్టైలిష్ గా కనిపిస్తుంది. దీని ముందటి భాగంలో LED హెడ్ లాంప్స్ స్టైలిష్ గా కనిపిస్తాయి. 208 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు 16 నుంచి 17 అంగుళాల అల్లాయి వీల్స్ కారుకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తాయి. అలాగే కారు ఇన్నర్ లో సీటింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది. క్యాబిన్ తో పాటు విండోస్ సౌకర్యవంతంగా ఉంటాయి.

ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా ఇందులో స్మార్ట్ టెక్నాలజీ కలిగిన ఫీచర్లు ఉన్నాయి. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే తోపాటు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ను అమర్చారు. వీటితోపాటు 9 ఆడియో స్పీకర్లు, JBL సౌండ్ సిస్టం, వైర్లెస్ చార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండడంతో ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయవచ్చు. అలాగే ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ కంట్రోల్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ADAS ఉండడంతో ఇందులో ప్రయాణించే వారికి సేఫ్టీగా ఉండే అవకాశం ఉంటుంది.

పెట్రోల్ తో పాటు, డీజిల్, CNG ఆప్షన్లలో ఉన్న ఈ కారు మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. లీటర్ ఇంధనానికి 17 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ ని అందించే ఈ కారు రోజువారి వినియోగదారులతో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. అంతేకాకుండా ఈ ఇంజన్ల నిర్వహణ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. పవర్ తో పాటు మైలేజ్ రెండు సమతుల్యత ఉండడంతో పూర్తిగా SUV కారు వలే తలపిస్తుంది. ఈ కారుదరా ప్రస్తుతం ధర రూ.7.32 లక్షల ప్రారంభం నుంచి రూ.14.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి Brezza వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version