Tata Motors :రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే, భారతదేశపు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీపై ఏకంగా రూ. 85వేల వరకు తగ్గింపును ప్రకటిచింది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌లో కేవలం నగదు తగ్గింపు మాత్రమే కాకుండా, మీ పాత వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి అదనపు బోనస్ కూడా లభిస్తుంది. ఈ తగ్గింపుకు సంబంధించిన మరింత సమాచారం కోసం వినియోగదారులు తమ సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read : భారీగా పడిపోయిన టాటా మోటార్స్ సేల్స్.. మరి స్టాక్ పరిస్థితేంటి.. అసలు ఇలా ఎందుకు జరిగింది ?
టాటా టియాగో ఈవీ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మొదటి ఎంపికలో 19.2kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ ధీమాగా చెబుతోంది. ఇక రెండవ ఎంపిక విషయానికి వస్తే..ఇందులో మరింత పవర్ ఫుల్ 24kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 315 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని టాటా మోటార్స్ వెల్లడించింది.
టాటా టియాగో ఈవీ ఇంటీరియర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడింది. ఇది డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపరుస్తుంది. అలాగే, 4-స్పీకర్లతో కూడిన హార్మన్ సౌండ్ సిస్టమ్ మంచి సంగీతాన్ని అందిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (ఆటో ఏసీ) కారు లోపల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMలు), రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు డ్రైవింగ్‌ను మరింత ఈజీ చేస్తాయి. స్టీరింగ్ వీల్‌పైనే ఆడియో, ఇతర కంట్రోల్ బటన్లు ఉండటం డ్రైవర్ సౌలభ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక భద్రతా విషయానికి వస్తే, టాటా టియాగో ఈవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
టాటా టియాగో ఈవీ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 7.99 లక్షల నుండి మొదలవుతుంది. ఇక టాప్-ఎండ్ మోడల్ విషయానికి వస్తే, దాని ధర రూ. 11.14 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారీ తగ్గింపుతో, ఈ ఎలక్ట్రిక్ కారు మరింత అందుబాటులోకి రానుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా టియాగో ఈవీ ఒక బెస్ట్ ఆఫ్షన్ కావచ్చు.
Also Read : కారు ప్రియులకు గుడ్ న్యూస్.. దీనికి పెట్రోల్, డీజిల్, సోలార్ ఇవేమీ అవసరం లేదు.. ధర ఎంతో తెలుసా ?