Kia Syros : కియా సిరోస్ (Kia Syros) ఫిబ్రవరి 1న దేశంలో విడుదలైనప్పటి నుంచి సబ్-కాంపాక్ట్ SUV విభాగంలో ఒక పాపులర్ కారుగా మారింది. కియా కేవలం రెండు నెలల్లోనే సిరోస్ దాదాపు 16,000 యూనిట్లను విక్రయించింది. కంపెనీ రెండు నెలల్లో 15,986 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించి ఒక మైలురాయిని చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కియా సిరోస్ మార్చి 2025లో నమోదైన బ్రాండ్ మొత్తం అమ్మకాలు 25,525 యూనిట్లలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
భారతీయ మార్కెట్లో కియా సిరోస్ మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్‌లకు గట్టి పోటీనిస్తుంది. కియా సిరోస్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఇది రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ SUV భారతదేశంలో HTK, HTK (O), HTK Plus, HTX, HTX Plus, HTX Plus (O) అనే 6 వేరియంట్లలో లభిస్తుంది. అలాగే ఇది 8 వేర్వేరు ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
Also Read : వచ్చేసింది కియా సైరోస్.. ధర రూ. 9 లక్షలతో ప్రారంభం.. ఈ కారు టాప్ మోడల్ ధర ఎంత ?
కియా సిరోస్ ఫీచర్లు
కియా సిరోస్ SUV క్యాబిన్‌లో అనేక ఫీచర్లు అందించబడ్డాయి. కియా సిరోస్ క్యాబిన్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్, రియర్ సీట్లు, 16 వేర్వేరు అటానమస్ సేఫ్టీ ఫీచర్లతో కూడిన లెవెల్ 2 ADAS సూట్, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, OA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్ కోసం ప్రత్యేక స్క్రీన్, వెనుక వరుస సీట్ల కోసం రిక్లైన్, స్లైడ్ ఫంక్షన్ ఉన్నాయి. ఇందులో ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి కొన్ని ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంజిన్, పవర్, మైలేజ్
కియా సిరోస్ SUV పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆఫ్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. SUVలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్లు కూడా ఉన్నాయి. 1.0-లీటర్ T-GDi పెట్రోల్ ఇంజన్ 118 bhp పవర్, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ CRDi VGT డీజిల్ ఇంజన్ 114 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV లీటరుకు 17 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
Also Read : కియా సైరోస్ vs స్కోడా కైలాక్: ధర, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ పరంగా ఏ కారు మంచిదో తెలుసా ?