Tata Harrier EV
Tata Harrier EV : టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ SUV హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతుంది. జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV) తుది ఉత్పత్తి నమూనాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మీడియా నివేదికలు టాటా హారియర్ ఈవీ వచ్చే నెల అంటే ఏప్రిల్ లో రిలీజ్ కావచ్చునని పేర్కొంటున్నాయి. మార్కెట్‌లో టాటా హారియర్ ఈవీ ఇటీవల విడుదలైన మహీంద్రా XUV.e8, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Also Read : కార్ల కోసం ఎదురుచూసేవారికి శుభవార్త..
హారియర్ ఈవీ డిజైన్ ఇలా ఉండనుంది ?
డిజైన్ విషయానికి వస్తే, హారియర్ ఈవీ మల్టీ-లింక్ సస్పెన్షన్‌తో వస్తుంది. అయితే ఈవీలో క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌ను అందించారు. ముఖ్యమైన అప్‌డేట్ ఏమిటంటే దిగువ బంపర్‌పై నిలువు స్లాట్‌లు ఉన్నాయి. మరోవైపు ఫీచర్ల విషయానికి వస్తే.. ఈవీలో 12.3-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంటాయి. వీటితో పాటు ఈవీలో ADAS స్థాయి 2+ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
500 కిలోమీటర్లకు పైగా రేంజ్
పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే.. టాటా హారియర్ ఈవీలో 75 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించనున్నారు. ఇది త్వరగా ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, SUVలో చిన్న బ్యాటరీ యూనిట్ కూడా ఉంటుంది. హారియర్ ఈవీ డ్యూయల్-మోటర్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో రెండు యాక్సిల్‌లపై మోటార్లు అమర్చబడి ఉంటాయి. హారియర్ ఈవీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ను తన వినియోగదారులకు అందించగలదని తెలుస్తోంది.
Also Read : ఏ కార్లలో లేని కొత్త టాటా ఆల్ట్రోజ్‌లో ఉండే 4 స్పెషాలిటీలు ఇవే !