Premium-cars
Premium Cars: ప్రస్తుతం Electric వాహనాల హవా పెరిగిపోతుంది. దాదాపు ప్రతీ కంపెనీ ఈవీలను ఎక్కువ మొత్తంలో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా , కియా కార్లు ఎలక్ట్రిక్ వేరియంట్ లో SUVలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటికి పోటీగా TaTa కంపెనీ సైతం ఎస్ యూవీ వేరియంట్ లో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా తాజాడా ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో హారియర్ ఎస్ యూవీని ఆవిష్కరించింది. ఈ కంపెనీ నుంచి ICE ప్లాట్ ఫారంపై మార్కెట్లోకి వచ్చిన హారియర్ కు మంచి ఆదరణ లభించింది. దీంతో దీనిని ఇప్పుడు ఈవీల రూపంలో వినియోగదారులకు అందించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ కారు ఎలా ఉందో చూద్దాం..
దేశంలో మారుతి సుజుకీ కంపెనీ తరువాత టాటా కంపెనీ అత్యధిక కార్లు సేల్స్ చేయడంలో తన ప్రాధాన్యతను చాటుకుంటోంది. ఈవీ కాన్సెప్ట్ లో తాజాగా TaTa కంపెనీ నుంచి Harrier Suv EVని కూడా వినియోగదారులు ఆదరిస్తారని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. పాత హారియర్ లో కొద్దిగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొత్తగా గ్రిల్ ను ఏర్పాటు చేశారు. లేటేస్ట్ గా ఎల్ ఈడీ ల్యాంపులను అమర్చారు. అలాగే కొత్తగా యూజర్ ఇంటర్ ఫేస్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే ఇందులో పనోరమిక్ సన్ రూఫ్, కనెక్టివిటీ, అడాస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
TaTa కొత్త Harrierలో పవర్ ఫుల్ ఇంజిన్ ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇందులో అతిపెద్ద 75 కిలో వాట్ బ్యాటరీని చేర్చారు. మరో బ్యాటరీ కూడా ఆప్షన్ పద్ధతిలో ఉంటుంది. దీనీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇందులో ప్రధానంగా వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ ను అమర్చారు. దీంతో కారుకు ఎక్కువ శక్తి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ విభాగంలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. వీటిలో టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీ, కర్వ్ ఈవీలు ప్రముఖంగా ఉన్నాయి. ఇదే సమయంలో కొత్త హారియర్ గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది.
టాటా కొత్త హారియర్ ధర రూ. 25 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 30 లక్షల వరకు ఉంది. ప్రీమియం కార్లు కోరుకునేవారికి ఈ మోడల్ ది బెస్ట్ అని అంటున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఎస్ యూవీ కారు కావాలని అనుకునేవారికి ఇది సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. పాత హారియర్ వాడిన వారు సైతం దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతారని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇందులో కొత్తగా ఇంటర్ ఫేస్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనా ల మధ్య కాకుండా ఎలక్ట్రిక్ కార్ల మధ్యే పోటీ ఉంటుంది. ఈ సమయంలో TaTa Harrier SUV EV రాణిస్తుందని అంటున్నారు. మరి దీని సేల్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి..