Tata EV Scooter 2026: ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. భవిష్యత్ కాలంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మండిపోతాయని భావించి చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్లే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నాయి. మనదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలలో టాటా(Tata company) కంపెనీ ముందు వరుసలో ఉంటుంది.
టాటా కంపెనీ 2026 లో Tata EV scooter అనే మోడల్ ను తెర పైకి తీసుకొచ్చింది. అర్బన్ కంమ్యూటర్ సామర్థ్యం, మృదువైన, పర్యావరణ అనుకూలమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ మోడల్ ను టాటా కంపెనీ రూపొందించింది. డ్యూయల్ బ్యాటరీ, ఆధునికమైన డిజైన్, పర్యావరణ అనుకూలమైన ప్రయాణాన్ని అందించే విధంగా టాటా కంపెనీ ఈ మోడల్ రూపొందించింది.
ఈ మోడల్ లో సమర్థవంతమైన బ్యాటరీ ఉంది. ఒక చార్జితో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎటువంటి పనులకు అయినా సరే ఉపయోగించేలా ఈ మోడల్ ను రూపొందించింది. స్థిరమైన విద్యుత్ పంపిణీ, సున్నితమైన డిజైన్, అద్భుతమైన శక్తిసామర్థ్యం వంటి వాటిని ఈ మోడల్ లో టాటా కంపెనీ జత చేసింది.
స్టైలిష్ డిజైన్, అద్భుతమైన బాడీ లైన్, ఎల్ఈడి లైటింగ్, కాంట్రాక్ట్ ఫ్రేమ్ వంటి వాటితో ఈ స్కూటర్ సరికొత్తగా కనిపిస్తోంది. బరువు తక్కువగా ఉండడంతో బీభత్సమైన ట్రాఫిక్ లో కూడా సులువుగా ఈ వాహనాన్ని రైడ్ చేయవచ్చు. ప్రీమియం మోడల్ గా కనిపిస్తున్న ఈ స్కూటర్ లో ఈ తరానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించినట్టు టాటా కంపెనీ చెబుతోంది. డిజిటల్ డాష్ బోర్డు, బ్యాటరీస్థితి, రైడింగ్ గణాంకాలు, రియల్ టైం అప్డేట్, యాప్ ద్వారా నేవిగేషన్ వంటివి ఈ మోడల్ లో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ సిస్టం సెక్యూరిటీ కూడా ఈ మోడల్ లో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ మోడల్ స్కూటర్ నిర్వహణ కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడి ఉంటుంది. టైర్లు తక్కువ అరుగుదలను కలిగి ఉంటాయి. స్టీరింగ్ లో కూడా ఆధునికతత్వం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల స్కూటర్ నడిపే క్రమంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ లో కూడా వేగంగా దూసుకుపోవచ్చు.