Tata EV Car: ప్రతి రంగంలో ఇప్పుడు AI చొచ్చుకుపోతుంది. ఆటోమోబైల్ రంగంలోకి కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చింది. ఆకర్షణీయంగా ఉండే కార్లలో ఏఐ ఆధారిత ఫీచర్లు తీసుకువచ్చి వినియోగదారులను ఇంప్రెస్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వారికి అనుగుణంగా సమయం వృధా కాకుండా తొందరగా చార్జింగ్ అయ్యే బ్యాటరీని అమరుస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఫీచర్లు కరిగిన Tata కంపెనీ కారు ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు త్వరలో మార్కెట్లోకి వచ్చి అలజడి సృష్టించే అవకాశం ఉంది. మరి ముందుగానే దీని ఫీచర్స్ గురించి తెలుసుకుందామా..
కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఇప్పుడు ఎలక్ట్రిక్ మోడల్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం లేటెస్ట్ టెక్నాలజీతో EVలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే Tata కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ 2025 మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఇందులో ఇప్పటివరకు వచ్చిన కార్ల కంటే భిన్నమైన ఫీచర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులో డిసి చార్జర్లను ఉపయోగించనున్నారు. ఇవి 45 నిమిషాల్లో బ్యాటరీని 10 నుంచి 80% వరకు చార్జింగ్ అయ్యే విధంగా చేస్తాయి.. అలాగే హోమ్ చార్జింగ్ అయితే ఐదు నుంచి ఆరు గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఇందులో రెండు రకాల చార్జర్ లు ఉండడంతో వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగిపోతుండడంతో ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
ఈ కారులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది AI స్మార్ట్ డాష్ బోర్డు. ఇది AI ఆధారితంగా ఉండడంతో నేటి కాలం వారికి డ్రైవింగ్ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యవస్థ వాయిస్ కమాండ్, ప్రేడిక్టివ్ నావిగేషన్, బ్యాటరీ హెల్త్ వంటి విషయాలను ఎప్పటికప్పుడు అలాంటి చేస్తుంది. ఇందులో డిజిటల్ కాకపీట్ అనుభవాన్ని కూడా పొందవచ్చు. హై సెగ్మెంట్ కారులో మాత్రమే కనిపించే ఈ డాష్ బోర్డు ఇందులో ఉండడం తో ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఇందులో ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాక్టరీ ఫిట్ సన్ రూప్, విశాలమైన క్యాబిన్ సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఒక హ్యాచ్ బ్యాక్ కారు SUV లా అనుభూతిని ఇస్తుంది.
ఈ కారు కాంపాక్ట్ మోడల్ అయినప్పటికీ ఇందులో భద్రత పటిష్టంగానే ఉంటుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ తో పాటు EBD తో కూడిన ABS, రియర్ పార్కింగ్, రీ జనరేటివ్ బ్రేకింగ్ సిస్టం వంటివి ఉన్నాయి. ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చి రూ.4.5 లక్షల ప్రారంభ ధర నుంచి.6 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. భారతదేశంలో వచ్చే ఏడాదిలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఈవిల్లో ఇదే బెస్ట్ మోడల్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.