Tata electric cycles: కాలం మారుతున్న కొద్ది ప్రజల సౌకర్యాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే సైకిల్ ఉండేది. ఆ తర్వాత స్కూటర్లు, బైక్స్, కార్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం నగరాల్లో ఉండేవారు విపరీతమైన ట్రాఫిక్ ను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఇంధన ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు.. పర్యావరణ కాలుష్యాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ సైకిళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నగరాల్లో ఉండేవారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి ఇవి అనుగుణంగా ఉంటున్నాయి. ఇందులో భాగంగా టాటా కంపెనీకి చెందిన రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ఉండే బ్యాటరీ పవర్, అనువైన సీటింగ్ వంటివి సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇంతకీ వీటి ధర ఎంత అంటే?
టాటా కంపెనీకి చెందిన Airborne అనే ఎలక్ట్రిక్ సైకిల్ అందుబాటులోకి రాబోతుంది. ఈ సైకిల్ లో 36 V లిథియం అయాన్ బ్యాటరీ ఉండనుంది. ఇది 250 W BLDC హబ్ మోటర్ ను కలిగి ఉంటుంది. ఇందులో డిస్క్ బ్రేక్స్ తో పాటు సస్పెన్షన్ పోర్క్ వంటివి ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LCD డిస్ప్లేను చూడొచ్చు. ఈ డిస్ప్లేలో రైడర్ కు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీని బయటకు తీసి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి చార్జింగ్ చేస్తే 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. టాప్ స్పీడ్ లో 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. పట్టణాలతో పాటు నగరాల్లో ఉండే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిపై రైడ్ చేస్తే స్టైలిష్ గా కనిపిస్తారు. ప్యాట్ టైర్లు, అల్యూమినియం రిమ్స్, PU పాడేడ్ వంటి సాడిల్ భాగాలు భద్రతను అందిస్తాయి. దీని ధర రూ.43,995 తో విక్రయిస్తున్నారు.
ఇదే టాటా కంపెనీకి చెందిన మరో ఎలక్ట్రిక్ సైకిల్ Arcus. ఇందులో 36 V లిథియం అయాన్ బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 11.6 mAh కెపాసిటీతో పనిచేస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే అసిస్ట్ మోడ్ లో 60 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 250 వాట్. BLDC హబ్ మోటార్ తో టాప్ స్పీడ్ 25 కిలోమీటర్ల వేగం ఉంటుంది. దీనిని 3 Amp DC చార్జర్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ సైకిల్ కు LCD మల్టీకలర్ డిస్ప్లే ఉండరు ఉంది. దీంతో సైకిల్, వేగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. బ్రేక్ సెన్సార్ తో పాటు రియల్ లైట్, అల్యూమినియం రిమ్స్ వంటివి సౌకర్యాన్ని అందిస్తాయి. దీనిని రూ.34,999 ధరతో విక్రయిస్తున్నారు.