TATA Electric Cycle: ద్విచక్ర వాహనాల ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక కార్ల ధరలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చమురు ధరలు స్థిరంగా ఉండడం లేదు. ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటి స్థితిలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సిందే. ఇటువంటి స్థితిలో ఇంధనం ఖర్చు లేకుండా.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రయాణించాలంటే అంత ఈజీ కాదు. ఈ ప్రశ్నకు మేమున్నాము.. మేము విన్నాము అని చెబుతోంది.. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని అంటున్నది. ఇంతకీ టాటా కంపెనీ ఏ ధైర్యంతో ఈ మాట చెబుతోంది అంటే..
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా కంపెనీ(Tata company electric cycles) ముందు వరుసలో ఉంటుంది. ప్రీమియం నుంచి మొదలు పెడితే బడ్జెట్ వరకు ప్రతి వేరియంట్ లో అద్భుతమైన మోడల్స్ రూపొందించి తిరుగులేని స్థాయిలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు టాటా కంపెనీ దృష్టి ఎమర్జెన్సీ నీడ్స్ మీద పడింది. ఈ రంగంలో లక్షల కోట్ల వ్యాపారానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో.. ఇందులోకి ప్రవేశించింది. కాకపోతే ఈ వింగ్ లోకి మోడ్రన్ టచ్ ఇచ్చింది. అదే ఇప్పుడు టాటా కంపెనీని మరో స్థాయిలో నిలబెడుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రస్తుతం విపరీతమైన గిరాకీ ఉంది. ఇప్పటివరకు నాలుగు చక్రాల వాహనాల్లోనే ఎలక్ట్రిక్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గేమ్ చేంజెర్ మాదిరిగా టాటా కంపెనీ(Tata electric cycles) ఇప్పుడు ఎమర్జెన్సీ నీడ్స్ లోకి ఎలక్ట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే మిగతా కంపెనీల మాదిరిగా కాకుండా, ఎలక్ట్రిక్ సైకిల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి టాటా ఎలక్ట్రిక్ సైకిల్ అని పేరు పెట్టింది. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చామని టాటా కంపెనీ చెబుతోంది. దీని ధర 4500. ఒకసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు సాఫీగా ప్రయాణం చేయవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండానే ఈ సైకిల్ మీద రయ్యిమంటూ దూసుకుపోవచ్చు.
ఇందులో అద్భుతమైన పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. లాంగ్ డిస్టెన్స్ బ్యాటరీ ఉంది. లైట్ వెయిట్ డ్యూరబుల్స్ ఫ్రేమ్, స్మార్ట్ డిస్ప్లే ప్యానెల్, ఎకో ఫ్రెండ్లీ డిజైన్ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల దీని మీద ప్రయాణం సాఫీగా సాగుతుందని టాటా కంపెనీ చెబుతోంది.. ముఖ్యంగా మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సైకిల్ రూపొందించిన నేపథ్యంలో ధర కూడా అందుబాటులోనే ఉంది. ఇందులో అమర్చిన చిన్న మోటర్ పెడలింగ్ వ్యవస్థను కొనసాగిస్తుంది. స్వల్ప దూరాలకు అనుకూలంగా ఉంటుంది.