Tata Curvv Dark Edition: దేశంలో కార్ల సేల్స్ లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది మారుతి సుజుకీ కంపెనీ. అయితే దీనికి గట్టి పోటీ ఇస్తూ నెంబర్ 2 స్థానంలో నిలుస్తోంది టాటా కంపెనీ. ఈ కంపెనీకి చెందిన ఇప్పటికే ఎన్నో కార్లు వినియోగదారులకు ఆకర్షించాయి. ముఖ్యంగా SUV కార్లను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ కంపెనీ ముందు ఉంటుంది. అయితే ఇటీవల యూత్ ను ఆకర్షించేందకు లెటేస్ట్ టెక్నాలజీతో కొత్త ఎడిషన్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే టాటాకు చెందిన Curv కు అదనపు ఫీచర్లు జోడించింది. టాటా కర్వ్ గత మార్చి నెలలో 3,785 అమ్మకాలు నమోదు చేసి ప్రత్యేకతను చాటుకుంది. ఈ తరుణంలో కొత్త కారును అందుబాటులోకి తీసుకురావడం ప్రాధాన్యతను చాటుకుంది. ఇంతకీ ఈ కొత్త ఎడిషన్ ఎలా ఉందంటే?
Also Read: పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?
TaTa కంపెనీకి చెందిన Curv మొత్త మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటిలో ఒకటి పెట్రోల్, రెండోది డీజిల్ కాగా.. మూడోది ఎలక్ట్రిక్ పవర్ ట్రెయినర్. SUV వేరియంట్ ను కలిగిన ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే ఆకట్టుకుంది. ఇందులో శక్తివంతమైన బ్యాటరీని చేర్చి ఉంది. ఇప్పుడు కొత్తగా Dark ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్ డిజైన్ తో పాటు బ్లాక్ కలర్ లో అద్భుతంగా ఉందని తెలుస్తోంది. పాత కర్వ్ డిజైన్ ను అలాగే ఉంచి.. ఇంటీరియర్ లో కొద్దిగా మార్పులు చేశారు.
కొత్త ఎడిషన్ లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 125 బీహెచ్ పీ పవర్ తో పాటు 225 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. స్పోర్ట్స కారు కొనాలని అనుకునే యూత్ కు ఈ కారు బాగా నచ్చుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఈ మోడల్ లో హర్స్ పవర్ శక్తి ఎక్కువగా ఉంటుందని దీంతో రయ్ మని వెళ్లాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుందని అంటున్నారు. అయితే మిగతా ఫీచర్లు పాత కర్వ్ లాగే ఉన్నాయి. ఇప్పటి వరకు కర్వ్ డీజిల్ మోడల్ లీటర్ ఇంధనానికి 17.88 నుంచి 19.25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ వేరియంట్ కారు 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో 502 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది.
ఇప్పటికే టాటా కంపెనీకి చెందిన ఎన్నో మోడళ్లు మార్కెట్లో అందుబాటలో ఉన్నాయి. ఇప్పుడీ మోడల్ తో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంటున్నారు. ప్రస్తుతం టాటా కర్వ్ ఎడిషన్ రూ.16.49 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.19.52 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఎలక్ట్రిక్ వేరియంట్ మాత్రం రూ.22.24 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.