Tata Curvv vs Tata Sierra: భారతదేశంలో కార్ల ఉత్పత్తిలో TATA కంపెనీ రెండో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో సౌకర్యవంతమైన కార్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులను తెలుసుకొని వారికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో కార్లను పరిచయం చేస్తుంది. అయితే ఇదివరకే దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన మిడ్ సైజ్ SUV కార్లు అయిన కర్వ్, సియెర్రా కార్లు విభిన్న స్థానంలో ఉన్నప్పటికీ ఇవి రెండు ఒకే ఇంజన్ ను కలిగి ఉన్నాయి. అయినా కూడా ఈ రెండిటిలో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవాలని చాలామందికి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ రెండు కార్లను పోల్చి చూస్తే విభిన్నమైన విషయాలు బయటకు తెలిసాయి. మరి ఈ కార్ల గురించి వేరువేరుగా చూస్తే..
TATA సియెర్రా కారులో 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ ను చేర్చారు. ఇది 118 hp పవర్ ను అందిస్తుంది.280 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 50 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న దీనిని రూ.15.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
అలాగే TATA కంపెనీకి చెందిన కర్వ్ విషయానికి వస్తే.. ఇందులో 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ ను చేర్చారు. ఇది 118 hp పవర్ ను అందిస్తుంది.260 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ DCT గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 44 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న దీనిని రూ.13.88 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
ఈ రెండు కార్ల మధ్య డీజిల్ ఇంజన్ ఒకటే అయినప్పటికీ..సియెర్రా కారులో కొంచెం ఎక్కువగా టార్క్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో 280 NM టార్క్ రిలీజ్ అయితే.. కర్వ్ లో 260 NM టార్క్ రిలీజ్ అవుతుంది. అలాగే కర్వ్ కారులో DCT గేర్ బాక్స్ జత చేయబడింది. ధర విషయంలోనూ సియెర్రా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండడంతో వినియోగదారులకు ఇది సౌలభ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే టాటా సియెర్రా లీటర్ ఇంధనానికి నగరాల్లో 11.53 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హైవేలపై 14.56 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. అలాగే కర్వ్ కారులో నగరాల్లో అయితే 11.15 ఉండగా.. హైవేలపై 17.23 వరకు వెళ్లవచ్చు. మైలేజ్ కోరుకునే వారికి మాత్రం కర్వ్ కారు బాగా నచ్చుతుంది. కర్వ్ కారు ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ సియెర్రా కారులో ఆరు లీటర్ల వరకు ఎక్కువగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది.
