https://oktelugu.com/

ఆ యూట్యూబ్ ఛానల్ కు కోటి మంది సబ్ స్క్రైబర్లు.. ఎలా సాధ్యమైందంటే?

యూట్యూబ్ లో కుకింగ్ వీడియోలను చూసేవాళ్లకు విలేజ్ కుకింగ్ ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. గడిచిన మూడు సంవత్సరాలుగా విలేజ్ కుకింగ్ ఛానల్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తాజాగా విలేజ్ కుకింగ్ ఛానల్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా కోటి మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఆరుగురు రైతులు నడిపిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం. పక్షుల కిలకిలల మధ్య, పల్లెదనం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 7, 2021 / 03:18 PM IST
    Follow us on

    యూట్యూబ్ లో కుకింగ్ వీడియోలను చూసేవాళ్లకు విలేజ్ కుకింగ్ ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. గడిచిన మూడు సంవత్సరాలుగా విలేజ్ కుకింగ్ ఛానల్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తాజాగా విలేజ్ కుకింగ్ ఛానల్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా కోటి మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఆరుగురు రైతులు నడిపిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం.

    పక్షుల కిలకిలల మధ్య, పల్లెదనం ఉట్టిపడే ప్రాంతాల్లో వంటకాలు చేయడం ఈ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత. ఆరుగురు రైతులు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన మొత్తాన్ని సేవా కార్యక్రమాల కొరకు వినియోగిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఉండే చిన్నవీరమంగళం అనే గ్రామంలో నివశించే సుబ్రమణియన్ ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు బ్లాగులు రాస్తుంటాడు. సుబ్రమణియన్ యూట్యూబ్ కు ప్రేక్షకాదరణ పెరిగిన తర్వాత వంటల ఛానల్ ను ప్రారంభించాలని అనుకున్నాడు.

    చిన్నవీరమంగళం గ్రామంలో పెరియతంబి అనే వ్యక్తి వంటలు అద్భుతంగా చేయడంలో సిద్ధహస్తుడు. రైతులు తమిళ్ సెల్వన్, ముత్తుమణికం, మురుగేశన్, అయ్యనార్ లకు కుకింగ్ ఛానల్ ఆలోచన నచ్చడంతో వాళ్లు కూడా భాగస్వాములయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతులు ఉన్న ప్రాంతానికి రావడం, గరిటె తిప్పడంతో యూట్యూబ్ ఛానల్ కు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది.

    ఛానల్ ద్వారా బాగానే ఆదాయం వస్తున్నా వీళ్లు వ్యవసాయం కూడా చేస్తుండటం గమనార్హం. గ్రామంలోనే వీళ్లు స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఈ స్వచ్చంద సంస్థ ద్వారా మానసిక వికలాంగులకు, పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆశ్రయం కల్పిస్తుండటం గమనార్హం.