Shirdi Tour: రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీ సచ్చితానంద సాయినాథ్ మహరాజ్ ను దర్శించాలని ఎవరికి ఉండదు. ఆయనను చూస్తేనే ఆనందం పొంగి పొర్లుతుంది. షిర్డీ సాయి దర్శనం సకల దేవతల దర్శనంగా కీర్తి కెక్కింది. సాయిబాబా పాదాలను స్మరిస్తేనే చాలు పాపాలు పటాపంచలు అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. షిర్డీలో వెలిసిన సాయిబాబాకు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం భక్తులు ఉన్నారు. విదేశాల నుంచి ఎందరో మంది సాయి దర్శనం కోసం వస్తుంటారు. రాని వారు తపిస్తుంటారు. షిర్డీ వెళ్లాలని చాలా మంది ఎంతో ఆశ పడుతుంటారు. బాబా దర్శనం కలిగితే చాలని మమ్ములను తమ వద్దకు తీసుకెళ్లాలి బాబా అని మొక్కులు మొక్కుతుంటారు. ట్రైన్ లేదంటే బస్సులో నాలుగు రోజుల ట్రిప్ వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా రెండు రోజుల్లోనే షిర్డీ టూర్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదా..! ఇలాంటి వారి కోమే తెలంగాణ టూరిజం మంచి టూర్ ప్యాకేజీని తెచ్చింది. కేవలం రెండుల్లోనే ఫ్లైట్ ప్రయాణంతో టూర్ ముగియడం ఈ ప్యాకేజీ ప్రత్యేకత. హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో షిర్డీ వెళ్లేలా టూర్ ప్యాకేజీ డిజైన్ చేస్తున్నారు. షిర్డీ ఫ్లైట్ ప్యాకేజీ పేరుతో ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి? ప్యాకేజీ ధర ఎంత వరకు ఉంటుంది? తదితర వివరాలు తెలుసుకుందాం..
* ప్రయాణం తేదీ మొదటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి జర్నీ ఉంటుంది.
* అదే రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు టూరిజం కేటాయించిన హోటల్ లోకి చెకిన్ అవుతారు.
* ఫ్రెషప్ అయిన తర్వాత బాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతి చూపించడంతో పాటు, వీఐపీ దర్శనం కుదరకపోతే ఫ్రీ దర్శనం ఉంటుంది.
* రాత్రి 7 గంటలకు థీమ్ పార్క్ షో ఉంటుంది. 8 గంటల వరకు షాపింగ్ చేయవచ్చు. 9 గంటల తర్వాత హోటల్ కు చేరుకుంటారు.
* రెండో రోజు ఉదయం చేసిన అనంతరం పంచముఖ గణపతి టెంపుల్‌కు వెళ్లాలి. కండొబా మందిర్ వెళ్లడంతో పాటు సాయి తీర్థ్ సందర్శన ఉంటుంది. సెకండ్ డే ఈవినింగ్ షిర్డీ టూ హైదరాబాద్ ఫ్లైట్ 5.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో షిర్డీ టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు..
విషయానికి వస్తే హైదరాబాద్ – షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర రూ. 12,499గా ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి ఉంటుంది. వివరాలకు ఫోన్ నెం. 9848540371లో సంప్రదించవచ్చు. వివరాలు, టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేందుకు కింది లింక్ పై క్లిక్ చేయండి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More