Suzuki Swift: ఇండియాలోని ఆటోమొబైల్ రంగంలో అతిపెద్ద కంపెనీగా మారుతి సుజుకీగా చెప్పుకుంటారు. భారత్ కు చెందిన మారుతి, జపాన్ కు చెందిన సుజుకీలు కలిసి ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అవి సక్సెస్ గా రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సుజుకీ మారుతితో కాకుండా నేరుగా కొత్త మోడల్ ను ఆవిష్కరించడానికి రెడీ అవుతోంది. మారుతి సుజుకీ నుంచి ఇప్పటికే స్విఫ్ట్ మార్కెట్లోకి వచ్చి కస్టమర్ల మనసును దోచుకుంది. అయితే సుజుకీ అప్ గ్రేడ్ వర్షెన్ తో స్పోర్ట్స్ తరహాలో దీనిని ఉత్పత్తి చేసింది. ముందుగా జపాన్ మార్కెట్లో విడుదల చేసిన తరువాత.. ఇండియాలో ఈ మోడల్ ను తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి దీని గురించి వివరాలేంటో తెలుసుకుందామా..
ఈ మధ్య హ్యాచ్ బ్యాక్ కార్లు ఆకట్టుకుంటున్నాయి. మారుతి సుజుకి స్విప్ట్ గురించి దాదాపు కార్లు వినియోగించేవారికి తెలిసే ఉంటుంది. ఇదే మోడల్ ను సుజుకీ సొంతంగా అప్ గ్రేడ్ చేసింది. సుజుకీ స్విఫ్ట్ 1.2 లీటర్ పెట్రోల్ ఫ్యూయల్ ను కలిగి ఉంటుంది. ఇందులో 3 సిలెండర్ ఎట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ను అమర్చారు. ఒక్క లీటర్ కు 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది CNG ఆప్షన్లో వస్తున్నందున 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని అంటున్నారు. ఇప్పుడున్న హ్యాచ్ బ్యాక్ కార్లకు కాస్త అప్డేట్ గా దీనిని తయారు చేశారు.
ఇప్పుడున్న హ్యాచ్ బ్యాక్ కార్లలో 5 స్పీడ్ మ్యానువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఉంటుంది. ఇదే కోవలో సుజుకి స్విఫ్ట్ లోనూ ఇవే అప్షన్లు ఉంటాయి. అయితే వీటితో పోలిస్తే కాస్త యాంగ్యులర్ గా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. కొత్త గ్రిల్ మోడల్, కొత్త ఎల్ ఈడీ ఎలిమెంట్స్ తో పాటు స్లీక్ గా హెడ్ ల్యాంప్స్, ఫాక్స్ ఎయిర్ వెంట్ తో సుజుకీ స్విఫ్ట్ ఆకట్టుకోనుంది. కొత్త బడీ ప్యానెల్, బ్లాక్ అవుట్ పిల్లర్ తో కారు ప్రియులకు కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు స్విఫ్ట్ నుంచి 4 మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు 5వ మోడల్ రానుంది. దీనికి స్విఫ్ట్ స్పోర్టివ్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్స్ అనే నామకరణం చేశారు. దీనిని ముందుగా 2024 ఫిబ్రవరిలో జపాన్ లో లాంచ్ చేయనున్నారు. అయితే ఇండియాలో ఎప్పుడు అనేది ప్రకటించలేదు. దీనిని టయోటా కు చెందిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నిక్ మోడల్ లో ఉంటుంది. అయితే కొందరు ఆటోమొబైల్ కు చెందిన నిపుణులు మాత్రం ఈ ఏడాది చివర్లోనే మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు.
6