Suzuki Food Business: ఇండియన్ వంటకాలు అద్భుతంగా ఉంటాయి. దాదాపు 300 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు మించి వేడిపై భారతీయులు వంటలు చేసుకుంటారు. పైగా వంటలను అద్భుతంగా చేస్తారు. అందువల్లే ఇండియన్ వంటలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. సరిగ్గా ఈ వంటలపై ఆటోమొబైల్ దిగ్గజం ఫోకస్ పెట్టింది.
Also Read: పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ మూవీ లో ప్రభాస్..కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్!
సుజుకి సంస్థ ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ఫుడ్ మార్కెట్లోకి రెడీ టు ఈట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూన్ 2025లో సుజుకి ఈ వ్యాపారం లోకి వచ్చి ఏకంగా.. గడచిన మూడు నెలల్లో 100,000 ప్యాకెట్లు విక్రయించింది.. ఈ ఆలోచన సుజుకి సంబంధించిన హమామట్సు లో మొదలైంది. సుజుకి కంపెనీ ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి టోరీ జెన్ అనే కంపెనీ భాగస్వామ్యంతో అడుగుపెట్టింది..
టోరీ జెన్ కంపెనీకి ఫుడ్ బిజినెస్ లో 150 ఏళ్ల చరిత్ర ఉంది. సుజుకి, టోరీ జెన్ సంస్థలు కలిసి రెడీ టు ఈట్ కర్రీ కిట్ లను డెవలప్ చేస్తున్నాయి. కర్రీ కిట్ లకు సుజుకి ఇండియన్ వెజిటేరియన్ కర్రీ బ్రాండ్ కింద విక్రయిస్తున్నాయి. ప్రతి ప్యాక్ ను 500 రూపాయల చొప్పున అమ్ముతున్నాయి. ప్రారంభంలో సుజుకి డైకాన్ ముల్లంగి సాంబార్, టమాటో లెంటిల్, చిక్ పా మసాలా, ముంగ్ దాల్ గ్రీన్ కర్రీ కిట్ లు విక్రయిస్తోంది. త్వరలోనే మరో 14 కర్రీలను విక్రయించబోతోంది. వీటిని జపనీస్ కుటుంబాలు ఇష్టపడుతున్నాయి.. భారతీయ రుచులను మేళవించి వీటిని తయారు చేస్తున్న నేపథ్యంలో జపాన్ ప్రజలు లొట్టలు వేసుకొని తింటున్నారు.
సుజుకి కంపెనీ తీసుకున్న నిర్ణయం జపాన్ దేశంలో సంచలనం సృష్టిసున్నది. ఈ విషయాన్ని ప్రముఖ ఆటోమేటివ్ జర్నలిస్టు కుషన్ మిత్ర సోషల్ మీడియా ద్వారా బయటికి తీసుకొచ్చారు. ” సుజుకి కంపెనీ జపాన్ దేశంలో ప్రీ ప్యాకెజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. వారు భారతీయ కూరలను రెడీ టు కుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. గడిచిన నాలుగు నెలల్లో లక్ష ప్యాకెట్లు విక్రయించారు. విశేషమైన స్పందన వస్తున్న నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సుజుకి సిద్ధమైంది. సుజుకి కంపెనీ టోరీ జెన్ తో వినూత్నంగా ముందుకు వెళ్తోంది. కొద్ది నిమిషాలలోనే వేడి నీటిలో వేయగానే.. వడ్డించగలిగే రెడీ టు ఈట్ కర్రీ కిట్ లు అభివృద్ధి చేస్తోందని” కుషన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.