Suzuki : సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన యాక్సెస్ స్కూటర్ (Suzuki Access) సరికొత్త ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. దీనికి ‘రైడ్ కనెక్ట్’ అని పేరు పెట్టారు. దీని ధర రూ.1,01,900 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్‌లో ‘పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్’ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను అందించారు. అంతేకాకుండా, కొత్త 4.2-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేను అమర్చారు. ఇది స్పష్టమైన విజువల్స్, ఫాస్టెస్ట్ రిఫ్రెష్ రేట్, హై కాంట్రాస్ట్ రేషియో, మరింత యాక్యురేట్ కలర్స్ చూపిస్తుంది.
యాక్సెస్, సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటి. సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్పెషాలటీ ఏంటంటే.. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయగల కంప్లీట్ కలర్ 4.2-అంగుళాల టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది బలమైన సూర్యకాంతిలో లేదా చీకటిలో కూడా మంచి విజిబిలిటీని అందిస్తుంది. రైడర్‌లకు అన్ని పరిస్థితులలోనూ మెరుగైన సమాచారం అందుతుంది. సుజుకి రైడ్ కనెక్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.
Also Read: భారత్ – పాక్ “ఇమీడియట్ సీజ్ ఫైర్” .. ట్రంప్ ఏం చేసి ఉంటాడు?
సుజుకి యాక్సెస్ మోడల్
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 4 వేరియంట్లు, 6 రంగులలో అందుబాటులో ఉంది. సుజుకి యాక్సెస్ 125లో 124సీసీ BS6 ఇంజన్ ఉంది. ఇది 8.3 bhp పవర్, 10.2 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో సుజుకి యాక్సెస్ 125 రెండు వీల్స్ లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ యాక్సెస్ 125 స్కూటర్ బరువు 105 కిలోగ్రాములు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.
సుజుకి యాక్సెస్ ధర
యాక్సెస్ 125 స్టాండర్డ్ ధర రూ.1,00,750 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్లు యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్, యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్, యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ ధరలు వరుసగా రూ.1,08,050, రూ.1,13,050, రూ.1,18,104. ఇక్కడ పేర్కొన్న యాక్సెస్ 125 ధరలు ఢిల్లీలోని ఆన్-రోడ్ ధరలు. సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తి అయిన యాక్సెస్ 125ను 2025 కోసం అనేక మెరుగుదలలతో అప్‌డేట్ చేశారు. తద్వారా ఇది మరింత మెరుగ్గా ఉంటుంది.