SUV Cars: నిత్యావసర వస్తువుల లాగే సొంతంగా కారు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. దీంతో దేశంలో కార్ల విక్రయాలు రోజురోజుకు పెరిగపోతున్నాయ. మొత్తంగా కార్ల విక్రయాల్లో చిన్న కారు అని కాకుండా కన్వీనెంట్ గా ఉండేందుకు పెద్ద కారునే కొనుగోలు చేయాలని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో SUV కార్లకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా పరిశీలిస్తే సెడాన్ కార్ల కంటే ఎస్ యూవీ కార్ల విక్రయాలే ఎక్కువగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 2025 మార్చిలోనూ అదే జరిగింది. అయితే ఈ నెలలో ఈ వేరియంట్ లో ఏ కారు ఎక్కువగా విక్రయాలు జరుపుకుందో చూద్దాం..
Also Read: క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి ఆర్.బి.ఐ సంచలన ప్రకటన..
SUV కార్లకు డిమాండ్ పెరిగిపోతుండడంతో కంపెనీ ల మధ్య పోటీ తీవ్రమైంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఎస్ యూవీలు ఆకర్షిస్తున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన ఎస్ యూవీలను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా హ్యుందాయ్ కి చెందిన క్రెటాను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మారుతి బ్రెజ్జా, టాటా పంచ్, నెక్సాన్, మహీంద్రా స్కార్పియో వంటి ఎస్ యూవీలో టాప్ మోడల్ లో ఉన్నాయి. ఇవి పెట్రోల్చ డీజిల్ వేరియంట్లోనే కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ఎస్ యూవీ ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఆకర్షిస్తోంది. ఈ కారును 2025 మార్చి నెలలో 18,059 మంది కొనుగోలు చేశారు. ఈ కారు విద్యుత్ వేరియంట్ లోనే కాకుండా పెట్రోల్, డీజిల్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. దేశంలో మొత్తం కార్ల విక్రయాల్లో రెండో స్థానంలో TaTa కంపెనీకి చెందిన పంచ్ ను కూడా ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ కారు మార్చి నెలలో 17,7114 మంది కొనుగోలు చేశారు. ఆ తర్వాత మారుతి సుజుకి బ్రెజ్జా కార్లు కూడా ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. ఈ కారు మార్చి నెలలో 16,546 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. ఈ మోడల్ పెట్రోల్, సీఎన్ జీ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.
టాటా కంపెనీకి చెందిన మరో కారు నెక్సాన్ ఎస్ యూవీ వేరియంట్ లో అలరిస్తోంది. ఈ కారును మార్చి నెలలో 16,366 మంది కొనుగోలు చేశారు. ఈ మోడల్ పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంటల్ అందుబాటులో ఉంది. వీటి తర్వాత మహేంద్రకు చెందిన స్కార్పియో కూడా ఉంది. ఈ కారు 13,913 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. ఇవే కాకుండా మరికొన్ని కార్లు కూడా ముందు వరుసలోకి రావడానికి ప్రయత్నించాయి. ఎస్ యూవీ కార్లలో బూట్ స్సేస్ తో పాటు దూర ప్రయాణాలకు అనుగుణంగా ఫీచర్లు ఉండడంతో వీటి కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు ఎస్ యూవీ వేరియంట్లను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతుండడం విశేషం.