Modern business strategies: ఏ సంస్థ అయినా సరే సప్లై డిమాండ్ సూత్రం ఆధారంగానే పనిచేస్తూ ఉంటుంది. సప్లై కి తగ్గట్టుగా డిమాండ్ ఉంటే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. సప్లై ని మించి డిమాండ్ ఉంటే అప్పుడు లాభాలు వస్తుంటాయి.. అందువల్లే చాలా వరకు సంస్థలు సప్లై డిమాండ్ సూత్రాన్ని అనుసరిస్తుంటాయి. ఆచరణలో పెడుతుంటాయి. అయితే అన్నిసార్లు ఈ సిద్ధాంతం వర్కౌట్ కాదు. కొన్నిసార్లు ఫెయిల్ కూడా కావచ్చు.
సప్లై డిమాండ్ సూత్రాన్ని అన్ని సందర్భాల్లో ఆచరించడం సాధ్యం కాదు. పైగా ఇది వర్కౌట్ కూడా కాదు. అందువల్లే కొన్ని సంస్థలు విభిన్నమైన పద్ధతిలో వెళ్తున్నాయి. పైగా ఆ విధానంలో అద్భుతమైన రాబడులను సొంతం చేసుకుంటున్నాయి.. సరిగ్గా ఇటువంటి విధానాన్ని అమలు చేస్తూ చైనా కంపెనీ దండిగా సంపాదిస్తోంది. అంతేకాదు మార్కెట్ లీడర్ గా ఎదిగింది.
మనదేశంలో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, బ్యూటీ కేర్, mens care విభాగంలో అనేక బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ బ్రాండ్ల మధ్య పోటీ పెట్టి తను మార్కెట్ లీడర్ గా ఎదిగింది. తద్వారా వేల కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని కాస్త ఆలస్యంగా చైనా కంపెనీ అమలు చేస్తోంది.
చైనాలోని బి బి కే ఎలక్ట్రానిక్ కంపెనీ oppo, Vivo, oneplus, realme బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి ఈ ఉత్పత్తులు ఒకే సంస్థకు చెందినప్పటికీ విపరీతమైన పోటీ తత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ బ్రాండ్లకు వేరువేరుగా ఉద్యోగులను.. ఇతర వ్యవస్థలను బిబికె ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేసింది. తద్వారా ఈ ఉత్పత్తులను ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో విడుదల చేసింది. తద్వారా ప్రపంచ మార్కెట్ లో తనకంటూ ఒక వాటాను సృష్టించుకుంది. తద్వారా లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదించడం మొదలుపెట్టింది. అయితే ఇలా ఒకే కంపెనీకి సంబంధించిన వివిధ ఉత్పత్తుల మధ్య పోటీ పెట్టడం వల్ల వ్యాపారం జోరుగా సాగుతుందని.. ఆదాయం భారీగా వస్తుందని బి బి కే ఎలక్ట్రానిక్స్ కంపెనీ బాధ్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తమ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయని అంటున్నారు.