Summer Gadgets to keep Devices Cool: ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో మార్చి నెలలోనే మే నెలను తలపిస్తున్నాయి.. సాధారణంగా ఎండాకాలంలో అడుగు బయట పెట్టాలంటేనే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుంటాయి. సూర్యుడు భూమికి దగ్గరగా రావడం వల్ల వేడిమి అధికంగా ఉంటుంది.
ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంతవరకు చల్లదనాన్ని కోరుకుంటారు. నేటి కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకం పెరిగిపోయింది కాబట్టి.. ఎండాకాలంలో వాటిని ఉపయోగించేటప్పుడు వేడెక్కుతాయి. అటువంటి వాటిని కూల్ చేయడానికి గాడ్జెట్ లు వచ్చేసాయి.
ఎండాకాలంలో ఫోన్ ఉపయోగించి గేమ్స్ ఆడుతుంటాం. వీడియోలు కూడా చూస్తుంటాం. అలాంటప్పుడు ఫోన్ వేడి ఎక్కుతుంది. దాన్ని చల్లబరచడానికి ఈ మొబైల్ కూలింగ్ ప్యాడ్ సహకరిస్తుంది. ఇది సాధారణమైన ప్యాడ్ కాదు.. ఇందులో అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఉంది. ఇది ఫోన్ టెంపరేచర్ మొత్తాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
కూలింగ్ ప్యాడ్ ఉపయోగించడం వల్ల ఫోన్ ఎప్పటికీ కూల్ గానే ఉంటుంది. ఎల్ ఈ డీ డిస్ ప్లే మీ ఫోన్ ఎంత చల్లగా ఉందో ఎప్పటికప్పుడు మీకు సూచిస్తూనే ఉంటుంది. ఇందులో మ్యాగ్నెట్ ఫీచర్ అనేది ఉండడంవల్ల ఫోన్ వెనుక వెంటనే అతుక్కుపోతుంది. అప్పుడు గంటల తరబడి గేమ్స్ ఆడినా, లైవ్ స్ట్రీమింగ్ చేసినా ఫోన్ అసలు హ్యాంగ్ కాదు. బ్యాటరీ కూడా వేడి ఎక్కదు.. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్.. ఇలా ఏ మొబైల్ కైనా సరే అది సరిపోతుంది. దీని ధర 700 వరకు ఉంటుంది.
కళ్ళు ఫ్రై అయితే.. మ్యాజిక్ చేసేయండి..
ఎండాకాలంలో వేడికి ప్రభావితమయ్యే అవయవాలలో కళ్ళు ముందు వరుసలో ఉంటాయి. కళ్ళను ఎంత కూల్ గా ఉంచుతాయి శరీరం అంతా చల్లగా ఉంటుంది. అందువల్లే కళ్ళకు.. మెదడుకు చల్లటి రిలాక్సేషన్ ఇవ్వడానికి స్మార్ట్ బ్లూటూత్ గ్లాస్ వచ్చాయి. ఇందులో ఇన్బిల్ట్ గా స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ ప్రకారం కళ్ళజోడు పెట్టుకుంటే చాలు.. చెవులలో ఎవరికి వినిపించకుండానే.. మీకు మ్యూజిక్ వినిపిస్తుంది. ఫోన్ ఎత్తకుండానే కాల్స్ మాట్లాడేయవచ్చు. పాటలు వినొచ్చు. ఇందులో ఫోటోగ్రామిక్ లెన్సులు ఉన్నాయి. వీటిని ధరించినప్పుడు మీరు కనుక ఇంట్లో ఉండి ఉంటే.. ఆ స్మార్ట్ గ్లాసుల నుంచి బ్లూ లైట్ వస్తుంది. ఒక అడుగు బయట పెట్టగానే క్షణాలలోనే కూలింగ్ గ్లాసెస్ లాగా మారిపోతాయి. వర్షం కురిస్తే.. చెమట పడితే.. ఎటువంటి ఇబ్బంది కాకుండా దీని వాటర్ రెసిస్టెన్స్ కాపాడుతూ ఉంటుంది. ఇక ఈ కళ్లద్దాల ధర 1200 వరకు ఉంది.
నమ్మండి ఈ గొడుగు మంచు కురిపిస్తుంది
ఎండలు మండిపోతున్నప్పుడు చాలామంది నీడని కోరుకుంటారు. కాస్త చల్లగా ఉంటే బాగుండు అని భావిస్తారు. అయితే చాలామందికి ఏసి సౌకర్యం ఉండదు. పైగా ఫ్యాన్ కింద నిత్యం కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక కూలర్లు కూడా చాలా సేపు చల్లదనాన్ని ఇవ్వలేవు. ఇలాంటి క్రమంలో పర్సనల్ ఏసీ లాగా పని చేస్తుంది. ఈ బి ఎన్ ఎఫ్ సన్ అంబ్రెల్లా. ఇందులో ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఇది చల్లని నీటిని మంచు మాదిరిగా స్ప్రే చేస్తూ ఉంటుంది. ఎండలో వెళ్లినప్పటికీ.. గొడుగు పట్టుకుంటే దాని కింద నుంచి మంచు వాన కురుస్తూనే ఉంటుంది.. ఇలా మంచు కురవడానికి ఈ ఫ్యాన్ లో నాలుగు బ్యాటరీలు ఉంటాయి. గాలికి ఏమాత్రం తిరగబడని విండ్ ప్రూఫ్ డిజైన్ ఇందులో ఉంటుంది. అందువల్లే గాలిని.. మంచు జల్లులను ఇది ఏకకాలంలో అందిస్తుంది. స్నేహితులకు కానుకదా ఇవ్వడానికి ఇది అద్భుతమైన బహుమతి. దీని విలువ దాదాపు 5,990.