Summer Car Tips : వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇళ్లలో ఏసీలు, కూలర్లు విద్యుత్ బిల్లును పెంచేశాయి. ఇంటి కరెంటు బిల్లుతో పాటు, కారు నడిపే వారి పెట్రోల్ ఖర్చు కూడా వేసవిలో భారీగా పెరుగుతుంది. సామాన్యుడి బడ్జెట్‌కు ఇది పెద్ద భారంగా మారుతోంది. అసలు వేసవిలో కారు మీద ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? వాటిని ఎలా కంట్రోల్ చేయాలో ఈ కథనంలో తెలుసకుందాం.
Also Raed : వేసవిలో మీ కారును జాగ్రత్తగా చూసుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి
వేసవిలో కారులో ఎయిర్ కండీషనర్(ఏసీ)ను నిరంతరం ఉపయోగించడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో ఇంధన వినియోగం పెరుగుతోంది. వేడి వాతావరణంలో కారు కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. దీని వల్ల ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్ లేదా సీఎన్జీ ఖర్చు అవుతుంది.
ఖర్చు ఎంత పెరుగుతుందో తెలుసా?
ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. టాటా టియాగో చలికాలంలో నగరంలో 17-18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, అదే మైలేజ్ వేసవిలో 11-12 కిలోమీటర్లకు పడిపోతుంది. ప్రతిరోజూ ఇంటి నుంచి ఆఫీస్‌కు, ఆఫీస్ నుండి ఇంటికి 20 కిలోమీటర్లు కారు నడిపితే చలికాలంలో మీ ఖర్చు రూ.5-6 వేల వరకు ఉంటుంది. అదే వేసవిలో ఈ ఖర్చు దాదాపు రూ.10 వేలకు చేరుకుంటుంది. వేసవిలో ఏసీ మెయింటెనెన్స్, కూలెంట్, టైర్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా కొంత అదనంగా ఉంటుంది.
ఖర్చును ఇలా కంట్రోల్ చేయవచ్చు
వేసవిలో కారులో ఏసీ వేసుకోవడం తప్పనిసరి. అయితే, కొన్ని పద్ధతుల ద్వారా కారు మీద అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, చాలా వేగంగా ఏసీని నడపడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ లోడ్ పడుతుంది. మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి అవసరం లేకపోతే ఏసీని 1 లేదా 2 పాయింట్ల వద్ద మాత్రమే ఉంచండి. బయటి గాలి చల్లగా ఉంటే, కిటికీలు తెరిచి డ్రైవ్ చేయవచ్చు. మొదట కొన్ని నిమిషాలు కిటికీలు తెరిచి వేడి గాలిని బయటకు పంపండి. ఆ తర్వాత ఏసీ ఆన్ చేయండి. దీనివల్ల కూడా కొంతవరకు మైలేజ్ పెరుగుతుంది. అంతే కాకుండా, నగరంలో ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాల్లో ఇంటి నుండి బయలుదేరడానికి ప్రయత్నించండి.
Also Read : వేసవిలో కారు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?