
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయకుండా వేర్వేరు కారణాల వల్ల చదువుకు దూరమైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలుస్తోంది. 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
అయితే డిస్టెన్స్ విధానంలో పది, ఇంటర్ చదువుకుంటే మాత్రమే ఈ పథకానికి అర్హత పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి 2,000 రూపాయల ప్రొత్సాహం అందించనుందని తెలుస్తోంది. ఈ ఏడాది నుంచే ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం. అయితే కేంద్రం నేరుగా ఈ డబ్బును విద్యార్థుల చేతికి ఇస్తే ఆ డబ్బును వాళ్లు ఇతర అవసరాలకు వాడవచ్చని భావిస్తోంది.
అధికారులు ఆ డబ్బును విద్యార్థులకు ఏ విధంగా ఇస్తే మంచిదో అని ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారని త్వరలో ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను కేంద్రం ప్రకటించనుందని సమాచారం. ఈ పథకం అమలు ద్వారా చాలామంది విద్యార్థులు దూరవిద్య ద్వారా అడ్మిషన్ తీసుకునే అవకాశాలు సైతం ఉంటాయి. త్వరలో ఈ పథకం అమలు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
కేంద్రం ఈ పథకం ద్వారా రూ.2000 ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు ప్రశంసిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక విద్యాపీఠాల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. విద్యార్థుల అక్షరాస్యత రేటును పెంచడానికి కేంద్రం ఈ స్కీమ్ లను అమలు చేస్తోంది.