https://oktelugu.com/

ఎస్బీఐ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా కష్ట కాలంలో ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ నుంచి హోమ్ లోన్ తీసుకున్న వారికి బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐ హోమ్ లోన్లపై వడ్డీరేట్లను 6.70 శాతానికి తగ్గించడం గమనార్హం. 30 లక్షల రూపాయల లోపు హోమ్ లోన్ తీసుకున్న వాళ్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 1, 2021 / 08:48 PM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా కష్ట కాలంలో ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ నుంచి హోమ్ లోన్ తీసుకున్న వారికి బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐ హోమ్ లోన్లపై వడ్డీరేట్లను 6.70 శాతానికి తగ్గించడం గమనార్హం. 30 లక్షల రూపాయల లోపు హోమ్ లోన్ తీసుకున్న వాళ్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరనుంది.

    ఎస్బీఐ నుంచి 30 లక్షల రూపాయల నుండి 75 లక్షల రూపాయల మధ్య రుణం తీసుకున్న వాళ్లకు వడ్డీ రేటు 6.95 శాతంగా ఉండగా 75 లక్షల కంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకుంటే వడ్డీరేటు 7.05 శాతంగా ఉంటుంది. మహిళలు హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గడం వల్ల మరింత తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తక్కువ పడుతుందని సమాచారం.

    ఎస్‌బీఐ ఎండీ సీఎస్ శెట్టీ హోమ్ లోన్ పై వడ్డీ రేట్లను తగ్గించడం గురించి మాట్లాడుతూ ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు మరింత ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల రుణ గ్రహీతలకు ఈఎంఐ భారం తగ్గుతుందని సీఎస్ శెట్టీ పేర్కొన్నారు. హోమ్ లోన్ ఫైనాన్స్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రుణ గ్రహీతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఎస్బీఐ హోమ్ లోన్లపై వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సైతం ఎస్బీఐ బాటలోనే నడిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి.