Smartphone market in the country: కాలం మారుతున్న కొద్దీ మొబైల్ వినియోగదారులు పెరిగిపోతున్నారు. వినియోగదారులకు అనుగుణంగా ఫోన్లు కొత్త టెక్నాలజీతో అందుబాటులోకి రావడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చైనాకు చెందిన మొబైల్స్ అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఈ దేశంలోని పలు కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకుంటూ అగ్రస్థానంలో నిలుస్తున్నా. ఇందులో భాగంగా ఇటీవల ఈ ఏడాదికి సంబంధించిన మూడో త్రైమాసిక నివేదికను ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) మొబైల్స్ స్థానాలను రిలీజ్ చేసింది. వీటిలో టాప్ లెవల్లో వివో మార్కెట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఒప్పో, సాంసంగ్ సంస్థలు వరుసlo ఉన్నాయి. అయితే యాపిల్ తో సహా మిగతా మొబైల్స్ ఏ ఏ స్థానాల్లో ఉన్నాయా ఇప్పుడు చూద్దాం..
ఐడీసీ తెలిపిన నివేదిక ప్రకారం చైనాకు చెందిన వివో కంపెనీ 18.3% వాటాతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఒప్పో కంపెనీ 13.9%.. సాంసంగ్ 12.6 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యాపిల్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ కంపెనీ 10.4%తో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో వన్ ప్లస్ 2.4% మాత్రమే మార్కెట్ కు పరిమితమైందని నివేదికలు తెలుపుతున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం విభాగంలో ఇప్పటివరకు శాంసంగ్ మొబైల్స్ ఆధిపత్యం లో ఉండగా.. వీటిని వెనక్కి నెట్టి యాపిల్ ముందుకు వచ్చింది. గతంలో కంటే ఇప్పుడు యాపిల్ మొబైల్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ గతంలో 6% వాటాలు కలిగి ఉండగా ప్రస్తుతానికి 8 శాతానికి పెరిగినట్లు నివేదిక తెలుపుతుంది. యాపిల్ కు సంబంధించిన పాత మొబైల్ కు అవసరమయ్యే పరికరాలను కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ ఫోన్ లకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది.
భారత మార్కెట్లో స్మార్ట్ మొబైల్స్ కు రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇందులో భాగంగా ప్రీమియం, సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వెర్షన్ కోరుకునేవారు యాపిల్ ఫోన్ లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు ఐడిసి తెలిపింది. మాన్యువల్ నుంచి డిజిటల్మయం కావడంతో చాలామంది అప్డేట్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సాంసంగ్ కు కంపెనీ కూడా తన అమ్మకాల శాతాన్ని పెంచుకుంటుంది. ఈ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్ 24, అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25 వంటి ఫోన్లు ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హై రేంజ్ ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. దీంతో సాధారణ ఫీచర్స్ ఉండే వాటికంటే ఆల్ట్రా ఫీచర్స్ వాటికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా భారత మార్కెట్లో ఐఫోన్ తన ప్రాబల్యాన్ని మెల్లగా విస్తరించుకుంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఐఫోన్ కొనుగోలు చేయడానికి భారీ క్యూలు కట్టాల్సి వస్తుంది. కంపెనీ సైతం భారత మార్కెట్లో కొత్త కొత్త మోడల్స్ మిగతా దేశాల్లో కంటే ముందే రిలీజ్ చేస్తోంది.