Postoffice Schemes: దేశంలో ప్రస్తుతం కోట్ల సంఖ్యలో ప్రజలు పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో స్కీమ్స్ ను పోస్టాఫీస్ అమలు చేస్తోంది. వయస్సు, పెట్టుబడి ఆధారంగా పోస్టాఫీస్ స్కీమ్స్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఎక్కువ మొత్తం డబ్బులను ఇన్వెస్ట్ చేయలేని వాళ్ల కొరకు పోస్టాఫీస్ తక్కువ డిపాజిట్ స్కీమ్స్ ను కూడా అందిస్తోంది. పోస్టాఫీస్ స్కీమ్స్ అయిన సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇతర స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఏప్రిల్ 1వ తేదీనుంచి వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: RRR Viral: ఆర్ఆర్ఆర్ థియేటర్ తెరల ముందు మేకులు, ఇనుప కంచెలు
పీఎఫ్ వడ్డీ రేటు కోత, ఆర్‌బీఐ నివేదిక నేపథ్యంలో పోస్టాఫీస్ స్కీమ్స్ వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఒక్కో స్కీమ్ విషయంలో ఒక్కో వడ్డీరేటు అమలవుతుంది. పీపీఎఫ్ పథకంపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతుండగా సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 6.7 శాతం వరకు వడ్డీ రేట్లు అమలవుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎఫ్ వడ్డీరేటును 8.1 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను మారుస్తుంది. కొన్నిసార్లు వడ్డీరేట్లు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతాయి. పోస్టాఫీస్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
Also Read: Electricity Charges Hike: తెలంగాణ ప్రజలకు ‘షాక్’ ఇవ్వబోతున్న కేసీఆర్..