Homeబిజినెస్Tata Sierra EV Launch 2026: 30న మార్కెట్లోకి ‘సియెర్రా’ ఈవీ.. ఇప్పటికే మార్కెట్లో...

Tata Sierra EV Launch 2026: 30న మార్కెట్లోకి ‘సియెర్రా’ ఈవీ.. ఇప్పటికే మార్కెట్లో ఐసీఈ.. ఏది కొంటే బెటర్..

Tata Sierra EV Launch 2026: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించడానికి పాత తరం కార్లను మార్చి కొత్త తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా టాటా కంపెనీకి చెందిన ‘సియెర్రా’ ఈవీని జూన్ 30న మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. 1990ల నాటి ఐకానిక్ ‘టాటా సియెర్రా’ బ్రాండ్‌ను సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో టాటా మోటార్స్ తిరిగి తీసుకువస్తుండటంతో వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న దీని ఐసీఈ వెర్షన్‌ను కొనాలా? లేక జూన్ 30 వరకు ఆగి ఈవీ వెర్షన్ కోసం వేచి చూడాలా? అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే?

టాటా సియెర్రా ఈవీ డిజైన్ పాత తరం సియెర్రా క్లాసిక్ లుక్‌ను గుర్తు చేస్తుంది. ఇది పూర్తిగా లేటేస్ట్ ఎలక్ట్రిక్ శైలిలో రూపొందింది. దీని బాడీ షేప్ ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ – పెట్రోల్/డీజిల్) వెర్షన్‌ను పోలి ఉన్నప్పటికీ, ఈవీ మోడల్‌లో కొంత మార్పు చేశారు. ఎందుకంటే ఇందులో గాలి నిరోధకతను తగ్గించేందుకు ప్యాక్డ్ గ్రిల్, ఫ్యూచరిస్టిక్ బంపర్స్ అమర్చారు. అలాగే కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ 19 అంగుళాల ప్రత్యేక అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

ఈ కారు ఇంటీరియర్ సరికొత్త లగ్జరీ టెక్నాలజీతో రాబోతోంది. ఇందులో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్యాసింజర్ కోసం ప్రత్యేక స్క్రీన్‌తో కూడిన ‘ట్రిపుల్-స్క్రీన్’ సెటప్‌ను అందించే అవకాశం ఉంది. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీపుల్ యాంబియంట్ లైటింగ్, వెనుక సీటు ప్రయాణికుల కోసం ప్రీమియం ‘బాస్ మోడ్’ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఈవీలో ఉండబోతున్నాయి.

టాటా సియెర్రా కొత్త కారులో 65 kWh నుంచి 75 kWh బ్యాటరీ ప్యాకప్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు రియల్ వరల్డ్ రేంజ్‌ను ఇస్తుందని అంచనా. అంతేకాకుండా ఈ కారు రియర్ వీల్ డ్రైవ్ తో పాటుగా ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలోనూ లభించనుంది.

మరోవైపు, టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్ సాంప్రదాయ ఇంధన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి, ఇవి దాదాపు 170 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా వెళ్లేవారికి, ఛార్జింగ్ అవస్థలు వద్దు అనుకునేవారికి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చే ఐసీఈ వెర్షన్ ఒక నమ్మకమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

అయితే సిటీ లోపల ప్రయాణిస్తూ, తక్కువ రన్నింగ్ ఖర్చులతో పర్యావరణహితమైన, అత్యాధునిక ఫీచర్లు ఉన్న లగ్జరీ ఎస్‌యూవీని కోరుకుంటే జూన్ 30 వరకు ఖచ్చితంగా ఆగడం మంచిది. టాటా సియెర్రా ఈవీలో రాబోయే AWD ఆప్షన్, భారీ రేంజ్ మరియు లగ్జరీ ఫీచర్లు మీ నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఒకవేళ బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి, తరచూ హైవేలపై సుదూర ప్రయాణాలు చేస్తూ ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకడం ఇష్టం లేకపోతే, ఇప్పుడే అందుబాటులో ఉన్న ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వెర్షన్‌ను ఎంచుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version