Gold : బంగారం ఒక ఎమోషన్. ఇది వస్తువు కాదు. బోనస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా జీతం ఎక్కువ వచ్చినా ఫస్ట్ వచ్చే థాట్ బంగారం కొనాలి. ఇక భారతీయులకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంటుంది. అందుకే బంగారం రేటు ఎంత పెరిగినా సరే దాన్ని వదలకుండా కొంటారు. దీన్ని వేసుకునే నగ మాత్రమే కాకుండా పెట్టుబడి వస్తువుగా కూడా చూస్తారు. కానీ ఈ బంగారం ధర మాత్రం రోజు రోజుకు చాలా పెరుగుతుంది. ఇక 2024లో బంగారం ధర ఫుల్ గా పెరిగింది.
గత సంవత్సరం అంటే 2024లో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. లక్షకు చేరుకునేలా పెరిగింది. కానీ రూ. 85 వేల మార్క్‌కు చేరుకుని కాస్త తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,350గా ఉంది. అయితే ఈ తగ్గుదల కొద్ది రోజులకే పరిమితమనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం బంగారం ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉందట.
భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారం ధరలు భారీగా పెరిగుతాయి అంటున్నారు నిపుణులు. ఈ ధరలు పెరిగి 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 85 వేలకు చేరుతుంది అంటున్నారు నిపుణులు. కొన్ని సార్లు తులం బంగారం ధర రూ. 90 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట. అయితే 2024లోనే ఓ సారి తులం బంగారం ధర ఏకంగా రూ. 82 వేలకు చేరింది. బంగారం మాత్రమే కాదు వెండి కూడా బంగారంతో పోటీ పడీ మరీ పెరిగింది. ఈ ఏడాది కిలో వెండి ధర ఏకంగా రూ. 1 లక్ష మార్క్‌ను దాటవేయడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ సంవత్సరం ప్రారంభంలోనే బౌన్సు బంగారం ధర 2062 డాలర్లుగా పలికింది. ఓ దశలో ఏకంగా 2790 డాలర్ల స్థాయికి చేరింది ధర. ఇదిలా ఉంటే తాజాగా బంగారం ధర 2600 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది.
ఇక ఈ సంవత్సరం బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయట. బంగారంపై మెరుగైన రాబడి వస్తుందట. ప్రస్తుతం అంతర్జాతీయం నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయట. వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక వెండి సైతం వచ్చే ఏడాదిలో కిలో రూ. 1.25 లక్షలకు చేరుతుంది అంటున్నారు. అయితే ఏఐ టెక్నాలజీలో వెండి ఉపయోగం పెరుగుతుందని అంచనా. దీంతో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందట.