Phone users: మొబైల్ ఉపయోగించే వారికి టెలికాం సంస్థలు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పాయి. త్వరలో మొబైల్ చార్జీలు పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్లాన్స్ గతంలో కంటే హైక్ గా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో మరింతగా చార్జీలు పెరిగే అవకాశం ఉందని అనడంతో ఆర్థిక భారం తప్పదని అనుకుంటున్నారు. అయితే 2025 సంవత్సరంలో చార్జీలు పెంచడం ఇదే మొదటిసారి. మరి ఈ చార్జీలు పెంచడానికి కారణం ఏంటి? ఎంత మేరకు హైక్ కానున్నాయి? ఎవరిపై తీవ్ర ప్రభావం పడనుంది?
మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకటికి మించి సిమ్ లు వాడుతున్నారు. దీంతో రెండు సిమ్ కార్డుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కొన్ని సంస్థలు తప్పనిసరి రీఛార్జి మొత్తాన్ని కూడా భారీగా పెంచేసింది. దీంతో చాలామంది తమ పర్మినెంట్ నెంబర్ ను కాపాడుకోవడానికి అదనంగా డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేయిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎయిర్టెల్, జియో సంస్థలు మరోసారి రీఛార్జ్ ధరను పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవి పది నుంచి పది శాతం హైక్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. అయితే ఈ నెట్వర్క్ ను విస్తరించడానికి ఆయా సంస్థలకు అదనంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఈ భారాన్ని వినియోగదారుల నుంచే సేకరించడానికి రీఛార్జ్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెరిగే ఈ రీఛార్జ్ ధరల వల్ల సామాన్యులకే ఎక్కువగా ప్రభావం పడనుంది. ముఖ్యంగా రూ.199 తో రీఛార్జ్ చేసుకునే వారి మొత్తం పెరగనుంది. ఎందుకంటే చాలామంది బ్యాకప్ సిమ్ కోసం ఈ రీఛార్జ్ ప్లాన్ ను ఎక్కువగా చేసుకుంటున్నారు. దీని ధర పెంచితే తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే టెలికాం సంస్థలు దీని ధర పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
మిగతా ప్లాన్లలో సంస్థల మధ్య పోటీ ఉండడంతో వినియోగదారులు తమ సిం కార్డులను మార్చుకుంటున్నారు. అందువల్ల బేసిక్ ప్లాన్ ను పెంచాలని టెలికాం సంస్థలు నిర్ణయించాయి. ఈ ప్లాన్లు డిసెంబర్ చివరిలోగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టెలికా సంస్థలు ఈ ధరలను పెంచడంతో మొబైల్ యాప్ లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు రీఛార్జ్ చేసుకునే సమయంలో అదనంగా చార్జీలను విధిస్తున్నాయి. ఇప్పుడు వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.