https://oktelugu.com/

Hero Motocorp : బైక్ కొనేవారికి షాక్.. ఆ కంపెనీ ధరలు పెరుగుతున్నాయి.. 

స్ల్పెండర్ ఆన్ షో రూం రూ. 73,630 ఉండగా.. గ్లామర్ 78,000లతో విక్రయిస్తున్నారు. వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక  లేటేస్టుగా 2023 ఫ్యాషన్ ప్లస్ తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఫ్యాషన్ ప్లస్ ఓ ఓబీడీ 2 వస్తుంది. ఇది 20 ఫ్యూయెల్ ద్వారా నడుస్తుంది. దీని పాత మోడల్ 2020లో నిలిపి వేసింది. అప్డేట్ చేస్తూ మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ బైక్ ధర పెరిగే అవకాశం ఉంది.

Written By: Srinivas, Updated On : July 1, 2023 2:22 pm
Follow us on

Hero Motocorp : నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక మోడల్ టూ వీలర్ కచ్చితంగా ఉంటుంది. వీటిలో హీరోహోండా కంపెనీకి చెందినవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం హీరో, హోండా కంపెనీలు విడిపోయి వేర్వేరుగా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.  ఈ క్రమంలో హీరో బైక్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్ాయి. అయితే తాజాగా హీరో మోటాకార్ప్ తమ బైక్ ల ధరలు పెంచనున్నట్లు పేర్కొంది. 2023 జూలై 3 నుంచి ఈ కంపెనికి చెందిన ధరలు పెరుగుతున్నట్లు ప్రకటించింది. హీరో బైక్స్ ను ఇష్టపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. దీంతో ఈ ధరల ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
హీరో మోటా కార్ప్ అన్ని మోడళ్లు కాకుండా ఎంపిక చేసిన బైక్ ల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. బైక్ లతో పాటు ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే స్కూటర్ల ధరలు కూడా హైక్ పోజిషన్లో ఉంటాయంటున్నారు. 2023 మార్చి నెలలలోనే 2 శాతం బైక్ ధరలు పెరిగాయి. అయితే కేవలం మూడు నెలల్లోనే మరోసారి 1.5 శాతం ధరలు పెంచుతున్నారు. అంటే ఈ ఏడాదిలో 3.5 శాతం ధరలు పెంచినట్లు తెలుస్తోంది.
ముడి పదార్థాల ధరల పెరుగుదలతో పాటు ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం విధించే నిబంధనలను అనుసరించి ఉత్పత్తి ప్రమాణాలను తీసుకురావాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో కంపెనీలపై అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలోనే బైక్ లధరలు పెరుగుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. జూన్ 1 నాటికి హీరో మోటో కార్ప్ నుంచి 5,19, 474 విక్రయాలు జరిగాయి. అంటే మే నెలలోనే 6.7 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఇక హీరో మోటాకార్ప్ నుంచి ఇప్పటి వరకు స్ప్లెండర్, గ్లామర్ తదితర మోడళ్లు ఉన్నాయి. స్ల్పెండర్ ఆన్ షో రూం రూ. 73,630 ఉండగా.. గ్లామర్ 78,000లతో విక్రయిస్తున్నారు. వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక  లేటేస్టుగా 2023 ఫ్యాషన్ ప్లస్ తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఫ్యాషన్ ప్లస్ ఓ ఓబీడీ 2 వస్తుంది. ఇది 20 ఫ్యూయెల్ ద్వారా నడుస్తుంది. దీని పాత మోడల్ 2020లో నిలిపి వేసింది. అప్డేట్ చేస్తూ మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ బైక్ ధర పెరిగే అవకాశం ఉంది.