Shine 12 CC Bike New Model: రోజువారి వినియోగంతో పాటు.. లాంగ్ డ్రైవ్ చేసే ద్విచక్ర వాహనదారులు కొత్త వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే అధిక మైలేజ్ ఇస్తూ.. లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన.. ఆకట్టుకునే డిజైన్తో మార్కెట్లో ప్రస్తుతం ఓ బైక్ అలరిస్తుంది. అదే హోండా షైన్ 125 cc. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా దీనిని అప్డేట్ చేశారు. అంతేకాకుండా ఇంజన్ పనితీరు కూడా మెరుగుపడటంతో కావాల్సిన మైలేజ్ ఇస్తుంది. గతంలో కంటే ఇప్పుడు సౌకర్యవంతంగా ఉన్న ఈ బైక్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
Honda కంపెనీకి చెందిన shine 12 CC బైక్ ఇప్పుడు కొత్త తరహాలో మార్కెట్లోకి రాబోతోంది. నేటి తరం వారికి బాగా నచ్చేలా దీనిని తీర్చిదిద్దారు. గతంలో వచ్చిన బైక్ కంటే దీని డిజైన్ అద్భుతంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అందంగా తీర్చిదిద్దబడిన బాడీ ప్యానెల్ ప్రీమియం టచ్ ను అందిస్తాయి. సీటు పొడవుగా ఉండడంతో పాటు నిటారుగా ఉండే రైడింగ్ భంగిమ తో ప్రయాణం చేయవచ్చు. దీంతో ప్రతిరోజు ప్రయాణం చేసే వారికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఇందులో 124 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ను చేర్చారు. ఇది 10.7 పిఎస్ పవర్ను అందిస్తుంది. అలాగే 11 nm పార్కును ఉత్పత్తి చేస్తుంది. ఎలాంటి వైబ్రేషన్ లేకుండా నగరాలతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. బైక్ ఒక్కసారి ఆగిన తర్వాత వెంటనే పికప్ అందుకునే విధంగా ఇంజన్ ను మార్చారు. అధిక శబ్దం చేయకుండా స్మూత్ డ్రైవింగ్ అందిస్తుంది. ఈ ఇంజన్ పై లీటర్ ఇంధనానికి 85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కార్యాలయ అవసరాలతో పాటు విద్యార్థులకు ఇది ఆదాయం సేవ్ చేస్తుంది.
ఈ బైక్ పై ప్రయాణం చేసేవారు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎలాంటి గతుకుల రోడ్లు ఉన్న స్మూత్ గా వెళ్లేందుకు టైర్లను అమర్చారు. హైడ్రాలిక్ రియల్ షాక్ అబ్జర్వర్లు ఉండడంతో తేలికైన చట్రం, సమతుల్యమైన ఫ్రేమ్ బైక్పై వెయిట్ పడకుండా చూస్తాయి. అలాగే వైబ్రేషన్ లేకుండా కొనసాగుతుంది. ఈ బైక్ లో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, స్టార్ట్ స్టాప్ స్విచ్, మెరుగైన గేర్ లో ఉండడంతో స్మూత్ గా డ్రైవ్ చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ.88,000 ప్రారంభ ధరతో విక్రయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.