Piramal Pharma: ఆర్థిక సంవత్సరం-2030 నాటికి రెండు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న పిరమల్ ఫార్మా ఇటీవల జరిగిన అనలిస్ట్ మీటింగ్ లో రోడ్ మ్యాప్ ను వివరించింది. సెప్టెంబర్ 24న తన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో ‘మా అడ్రస్ చేయగల మార్కెట్లలో టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము’ అని కంపెనీ పేర్కొంది. దీంతో సెప్టెంబర్ 25 (బుధవారం) పిరమల్ ఫార్మా షేర్లు ఒక్క సారిగా 8 శాతానికి పైగా ఎగబాకాయి. దీంతో జెఫరీస్ పిరమల్ ఫార్మా టార్గెట్ ధరను రూ. 260కి పెంచింది. పిరమల్ ఫార్మా తన కాంట్రాక్ట్ డెవలప్ మెంట్ అండ్ మ్యాను ఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీడీఎంఓ) విభాగాన్ని, యాంటీ బాడీ-డ్రగ్ కాంజుగేట్ (ఏడీసీ) ప్లాట్ ఫామ్ ను వృద్ధి చోదకశక్తిగా ఉపయోగించుకుటుందని స్టాక్ బ్రోకింగ్ ఒక నోట్ లో వివరించింది. బుధవారం ఉదయం 9.55 గంటల సమయంలో పిరమల్ ఫార్మా షేరు 7 శాతం లాభంతో రూ. 232 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఏప్రిల్ నుంచి ఈ స్టాక్ స్థిరమైన సానుకూల నెలవారీ రాబడులను అందించింది. ఒక్క సెప్టెంబర్ లోనే నిఫ్టీ 50ని అధిగమించి 23 శాతం లాభపడింది. అదనంగా, పిరమల్ తన కాంప్లెక్స్ హాస్పిటల్స్ పోర్ట్ ఫోలియో, ఇండియా కన్స్యూమర్ హెల్త్ విభాగం వరుసగా 12 శాతం, 9 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఎజీఆర్) తో వృద్ధి చెందుతుందని ఆశిస్తోంది.
పీఎస్ఎస్ (సీడీఎంఓ) విభాగాన్ని విస్తరించడంపై బలమైన దృష్టితో ఇబిటా మార్జిన్లను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు వ్యయ ఆప్టిమైజేషన్, ఉత్పాదకత పెంపుదల సిద్ధంగా ఉంది. నికర రుణం/ ఇబిటా నిష్పత్తిని ఒక రేటుకు దిగువకు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత 3 రెట్ల నుంచి గణనీయంగా మెరుగుపడుతుందని యాంటిక్ చెప్పారు.
పిరమల్ ఫార్మా అనేది కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మ్యను ఫ్యాక్షరింగ్, హాస్పిటల్ జనరిక్స్, ఓవర్-ది-కౌంటర్ ఉత్పత్తులతో సహా అనేక ఉత్పత్తులకు సంబంధించి సేవలను అందించే ఒక గ్లోబల్ కంపెనీ.
2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పిరమల్ ఫార్మా కన్సాలిడేటెడ్ నికర నష్టాన్ని రూ. 98.6 కోట్ల నుంచి రూ. 88.6 కోట్లకు తగ్గించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన దాదాపు 12 శాతం వృద్ధితో రూ. 1,951 కోట్లకు చేరింది.