Second Hand Vehicles: ప్రయాణ అవసరాలకు ద్విచక్ర వాహనాలు చాలా వరకు ఉపయోగపడుతాయి. ఈమధ్య గేర్ బాక్స్ టూవీలర్ కంటే ఎక్స్ లేటర్ వాటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా హోండా , టీవీఎస్ కంపెనీలకు చెందిన వితౌడ్ గేర్ వాహనాల సేల్స్ పెరిగిపోతున్నాయి. ఇవి లోకల్ గా తిరగడానికి సౌకర్యంగా ఉండడంతో పాటు ఈజీ మూవింగ్ ఉంటుంది. అయితే కొంత మంది ఈ వాహనాలపై ఎక్కువ ధర చెల్లించడానికి ఇష్టపడరు. వీటి ధరలు రూ.80 వేల నుంచి రూ.1 లక్షకు పైగా ధరలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ ధరలు ఎలా ఉంటాయంటే?
హోండా కంపెనీ నుంచి యాక్టివా ఎక్స్ లేటర్ వెహికల్ ఎక్కువ ఆదరణ పొందింది. 125 సీసీ ఇంజిన్ ను కలిగిన ఇది 124 సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 8.3 పవర్ ను ఉత్పత్తి చేరస్తుంది. 104 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెహికల్ లీటర్ కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కొత్త వెహికల్ ను రూ.82,634 నుంచి రూ.91,807 వరకు విక్రయిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వెహికిల్ ను రూ.20 నుంచి రూ.40 వేల వరకు పొందవచ్చు. అయితే వెహికల్ కండిషన్, మిగతా పార్ట్స్ గురించి మెకానిక్ కు చూపించిన తరువాతే కొనుగోలు చేయాలి.
టీవీఎస్ కంపెనీ నుంచి యాక్సెస్ 125 అందుబాటులో ఉంది. ఇది 125 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇందులో 124 సీసీ సింగిల్ సిలిండర్ తో పాటు 8.7 పవర్, 10 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.83,482 నుంచి రూ.94,082 వరకు విక్రయిస్తున్నారు. ఈ వెహికల్ లీటర్ కు 45 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుంది. దీనిని సెకండ్ హ్యాండ్ వాహనం కండిషన్ బాగుంటే రూ.50 లకు మించి వెచ్చించరాదని కొందరు బైక్ మెకానిక్ లు అంటున్నారు.
ఇదే కంపెనీకి చెందిన జుపీటర్ 125 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇందులో 8.2 బీహెచ్ పీ పవర్ 10.5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.89,155 నుంచి రూ.99,805 వరకు విక్రయిస్తున్నారు. ఇది లీటర్ కు 57.27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని సెకండ్ హ్యాండ్ వెహికిల్ బట్టి రూ.50 నుంచి రూ.55 వేల వరకు కొనుగోలు చేయొచ్చు. అయితే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.