రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ రైల్వే జాబ్స్ కోరుకునే నిరుద్యోగ యువతీయువకులకు తీపికబురు అందించింది. వేర్వేరు జోన్లలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 16,000 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ కాగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుంచి వేర్వేరు జోన్లకు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. మొత్తం ఉద్యోగ ఖాళీలలో దక్షిణ మధ్య రైల్వేలో 4103 ఉద్యోగ ఖాళీలు ఉండగా https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. తూర్పు రైల్వే రిక్రూట్‌మెంట్ లో మొత్తం 3366 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
https://www.rrcecr.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కూడా నవంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 2226 ఉద్యోగ ఖాళీలు ఉండగా https://wcr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన 1664 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కనీసం ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.