https://oktelugu.com/

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. పాన్ కార్డు లింక్ చేయకపోతే నష్టపోయినట్లే..?

దేశంలోని 40 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో బ్రాంచ్ లు ఉండటం, ప్రభుత్వ రంగు బ్యాంక్ కావడంతో చాలామంది స్టేట్ బ్యాంక్ లో ఖాతా కలిగి ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా జత చేయాలి. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వివరాలను పాన్ కార్డ్ వివరాలను అప్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2021 / 11:30 AM IST
    Follow us on

    దేశంలోని 40 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో బ్రాంచ్ లు ఉండటం, ప్రభుత్వ రంగు బ్యాంక్ కావడంతో చాలామంది స్టేట్ బ్యాంక్ లో ఖాతా కలిగి ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా జత చేయాలి. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వివరాలను పాన్ కార్డ్ వివరాలను అప్ డేట్ చేయవచ్చు.

    Also Read: రూ.190కే అమెజాన్ లో ల్యాప్ టాప్ కొన్న వ్యక్తి.. చివరకు..?

    ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను పాన్ కార్డును లింక్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఎస్బీఐ డెబిట్ కార్డు యూజర్లు పాన్ కార్డ్ వివరాలను నమోదు చేస్తే మాత్రమే అంతర్జాతీయ లావాదేవీల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. ఎవరైనా ఎస్బీఐ డెబిట్ కార్డును కలిగి ఉండి అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించడం సాధ్యం కాకపోతే వెంటనే పాన్ కార్డ్ వివరాలను అప్ డేట్ చేయించుకోవాలని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా సూచించింది.

    Also Read: బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏమిటంటే..?

    పాన్ కార్డును బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం నగదును బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినా ఇబ్బందులు ఎదురు కావు. బ్యాంక్ ద్వారా పాన్ కార్డును బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయించుకోవాలని భావించే వాళ్లు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ లను బ్యాంకులో అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలని అనుకునే వాళ్లు మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి ప్రొఫైల్ పాస్ వర్డ్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    ఆ తరువాత పాన్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కొన్ని రోజుల తరువాత బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డ్ లింక్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డును లింక్ చేయడం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడక తప్పదు.