Post Office Schemes: ప్రస్తుతం ఇండియా పోస్ట్ పదుల సంఖ్యలో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడిని పొందే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అందుబాటులో ఉండే స్కీమ్స్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుండటం గమనార్హం. పోస్టాఫీస్ స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీరేటు అమలవుతుండటం గమనార్హం. సంవత్సరానికి లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆడపిల్లల పెళ్లి కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఇతర స్కీమ్స్ తో పోలిస్తే ఎక్కువ మొత్తం లభించనుంది. పదేళ్ల లోపు ఆడపిల్లలు ఉంటే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.
Also Read: సస్పెండ్ చేయడంపై హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్.. లేని అస్త్రాన్ని కేసీఆరే ఇచ్చారా..?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు కాగా అవసరమైతే మూడేళ్లు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే 7.1 శాతం వడ్డీ రేటు పొందే ఛాన్స్ ఉంటుంది.
ఈ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు మెచ్యూరిటీ సమయంలో 10 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. వయస్సు, అర్హతల ఆధారంగా ఈ స్కీమ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ ను పొందవచ్చు.
Also Read: ఉపాధ్యాయుల పదోన్నతులకు సీఎం గ్రీన్ సిగ్నల్