Samsung Galaxy S25 Edge : చాలా కాలంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్, ఐఫోన్ 17 ఎయిర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆపిల్ కంటే ముందే శాంసంగ్ తన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో వినియోగదారుల కోసం రిలీజ్ చేసింది. ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే ఈ తాజా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో గెలాక్సీ ఏఐ ఫీచర్ల సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ ఎన్ని వేరియంట్లలో విడుదల చేశారు. ఈ వేరియంట్ల ధర ఎంత? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Also Read : బంపర్ ఆఫర్! Samsung Galaxy S24 Plusపై రూ.47,000 తగ్గింపు!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్పెసిఫికేషన్‌లు
డిస్‌ప్లే: 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల క్వాడ్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొటెక్షన్‌తో వచ్చే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్: ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గెలాక్సీ ఎస్25 సిరీస్‌లోని అన్ని ఫోన్‌లలో ఇదే ప్రాసెసర్‌ను ఉపయోగించారు.కెమెరా : 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో ఈ ఫోన్ వెనుక భాగంలో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ విత్ మ్యాక్రో మోడ్ ఉంటుంది. దీనితో పాటు సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది.
బ్యాటరీ కెపాసిటీ : 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌లో 3900mAh పవర్ ఫుల్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 25 వాట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్‌తో లభిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఫోన్ బ్యాటరీ 30 నిమిషాల్లో 55 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 256 జీబీ, 512 జీబీ. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,09,999 నుంచి అందుబాటులో ఉంటుంది. 512 జీబీ వేరియంట్ రూ.1,21,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది.
Also Read : 6జీబీ ర్యామ్, 50ఎంపీ డ్యూయల్ కెమెరాతో శామ్సంగ్ బడ్జెట్ ఫోన్ లాంచ్.. పూర్తి ఫీచర్లు ఇవే !