UPI transaction limit: కూరగాయల నుంచి బంగారం కొనుగోలు వరకు ఇప్పుడు అంతా యూపీఐ ద్వారానే పేమెంట్ చేస్తున్నారు. చేతిలో మొబైల్ ఉంటే బ్యాంకు అందుబాటులో ఉన్నట్లే అనుకోవాలి. ఎందుకంటే మొబైల్కు బ్యాంకుతో లింకు చేసిన తర్వాత దీనిద్వారా భారీ మొత్తంలో కూడా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి పరిమితిని ఉంచారు. కానీ తాజాగా National Payments Corporation of India (NPCI) తెలిపిన ప్రకారం యూపీఐ పరిమితిని పెంచారు. అయితే ప్రస్తుతం యూపీఐ పేమెంట్ లిమిట్ ఎంత ఉంది? ఇప్పుడు దానిని ఎంతకు పెంచారు?
ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే చేతిలో డబ్బులు తప్పనిసరిగా ఉండేవి. లేదా తెలిసిన వారు అయితే అప్పు కింద వస్తువులు తీసుకొని.. ఆ తర్వాత డబ్బులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు బ్యాంకులో నగదు లేకున్నా కూడా.. క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంటే డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. అంతేకాకుండా రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు కూడా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఇలా బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా యూపిఐ చెల్లింపుల పరిమితి ఇప్పటివరకు రూ.5 లక్షలు ఉండేది.
ఒక పర్సన్ నుంచి మర్చంట్ చెల్లింపులు చేస్తే ఆ వ్యక్తి పరిమితి రూ. 5 లక్షలు ఉండేది. ఇప్పుడు దీనిని రూ. 10 లక్షలకు పెంచారు. అంటే కిరాణం వస్తువులు.. ఇతర వస్తువుల కొనుగోలు.. వంటివి రూ. 10 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. దీని పరిమితి ఇప్పటివరకు రూ. 5,00,000 ఉండేది. ఇకనుంచి రూపే క్రెడిట్ కార్డు ద్వారా రూ. ఆరు లక్షల వరకు పేమెంట్ చేసుకోవచ్చు. అంటే క్రెడిట్ కార్డు ద్వారా బీమా లేదా ఇతర ఏ బిల్లులు చెల్లించిన ఇదే వర్తిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో చాలామంది యూపీఐ ద్వారా బంగారం కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చెల్లింపులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు యూపీఐ ద్వారా బంగారం కొనుగోలు చేయాలంటే రూ. రెండు లక్షల వరకు మాత్రమే పరిమితి ఉండేది. కానీ ఇకనుంచి దీని ద్వారా రూ. ఆరు లక్షల వరకు చెల్లించుకోవచ్చు. మీ చెల్లింపులు త్వరలోనే అమల్లోకి వస్తాయని ఎన్పీసీఐ తెలుపుతోంది.
పెద్దపెద్ద వ్యాపారులు సైతం యూపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. దీంతో తాజాగా ఎన్సిపిఐ తీసుకున్న నిర్ణయంతో వీరికి ఎన్నో రకాలుగా ఉపయోగపడనుంది. అంతేకాకుండా ఒకేసారి డబ్బు మొత్తం చెల్లింపులు చేయడానికి కూడా సౌకర్యంగా ఉండనుంది.