https://oktelugu.com/

Airtel Roaming Plan : ఇక ప్రపంచవ్యాప్తంగా మీ ఫోన్ పనిచేస్తుంది.. 184 దేశాల రోమింగ్ ప్లాన్ ధర ఎంతంటే?

ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఐఆర్ ప్లాన్ లో 184 దేశాలకు కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. టారిఫ్ 133 తోనే మొదలవుతుంది.. దీనిని ఎయిర్ టెల్ " ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఒక ప్లాన్" అని నామకరణం చేసింది

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2024 11:08 pm
    Airtel Roaming Plan

    Airtel Roaming Plan

    Follow us on

    Airtel Roaming Plan ఫోన్ ఒకప్పుడు విలాసం.. ఇప్పుడు కనీస అవసరం.. ఒక మనిషి బాగోగులు మాత్రమే కాదు.. అతడికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు వాడుతున్న ఉపకరణం ఫోన్. ఈ ఫోన్ అనేక రూపాంతరాలు చెంది స్మార్ట్ ఫోన్ గా ఎదిగింది. మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మాటల నుంచి మొదలు పెడితే వ్యాపార లావాదేవీలు వరకు ఈ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ చార్జీలు తడిసి మోపిడయ్యేవి. అయితే రాను రాను చార్జీలు తగ్గడం.. అనేక ఆఫర్లు వినియోగదారులను ముంచెత్తాయి.. అయితే ఈ ఆఫర్లు మన దేశం వరకే వర్తించేలాగా టెలికాం కంపెనీలు వ్యవహరించేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది.

    పోటీ పెరగడం, వినియోగదారుల అవసరాలు పెరగడంతో టెలికాం కంపెనీలు సరికొత్త ఆఫర్లను తెరపైకి తీసుకొస్తున్నాయి. అందులో ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్ ను వినియోగదారుల చెంతకు చేర్చింది. ప్రస్తుతం చాలామంది విదేశాలకు చదువులు, ఉపాధి, ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నారు. వారి అవసరాల ఆధారంగా అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. 184 దేశాలకు రోజుకు ₹133 చొప్పున వసూలు చేస్తూ అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనిని ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ ద్వారా వినియోదారులు ఈ ప్లాన్ ఆక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల వినియోగదారులు ఇతర ప్లాన్లు యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైగా ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ ఉంటుంది.

    ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఐఆర్ ప్లాన్ లో 184 దేశాలకు కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. టారిఫ్ 133 తోనే మొదలవుతుంది.. దీనిని ఎయిర్ టెల్ ” ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఒక ప్లాన్” అని నామకరణం చేసింది. కేవలం కాల్స్ మాత్రమే కాకుండా డాటా ప్రయోజనాలు, ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ, 24/7 కాంటాక్ట్ సెంటర్ సపోర్టు లభిస్తుంది. వాస్తవానికి అంతకుముందు అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ లు చాలా ఖరీదుగా ఉండేవి. దీంతో వినియోగదారులకు ఆ ఖర్చులు తడిసి మోపిడయ్యేవి. పైగా వివిధ దేశాలకు టారిఫ్ లు ఒక్లాట్ విధంగా ఉండేవి. అయితే వినియోగదారుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ టెల్ ఈ సదుపాయాన్ని తెర పైకి తీసుకొచ్చింది. ఇకపై 184 దేశాలకు ప్రయాణించే వినియోగదారులు.. ఇతర ప్లాన్లను ఆక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త ప్లాన్ తో అద్భుతమైన కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. అంతేకాదు తరచుగా ఆ దేశాలకు ప్రయాణించే వారి కోసం ఎయిర్ టెల్ ఆటో రెన్యువల్ ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల పలుమార్లు ప్యాక్ ను కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా థాంక్స్ యాప్ ద్వారా దీనిని ఆటో రెన్యువల్ చేసుకోవచ్చు.

    ఈ ప్లాన్ ప్రకారం 649 తో రీచార్జ్ చేస్తే 500 MB డాటా 10 ఎస్ ఎం ఎస్, 100 OG/ IC నిమిషాలు( భారత్+ లోకల్)

    రూ. 755

    వ్యాలిడిటీ : 5 రోజులు
    100 నిమిషాలుIC+ OG(భారత్+ లోకల్)

    రూ. 899

    వ్యాలిడిటీ: 1GB, 100 నిమిషాలు IC+ OG( భారత్+ లోకల్), 20 ఎస్ఎంఎస్

    రూ. 2998

    వ్యాలిడిటీ: 30 రోజులు

    డాటా: 5GB, 200 నిమిషాలు IC+ OG( భారత్+ లోకల్), 20 ఎస్ఎంఎస్, విమానంలో 250 MB, 100 నిమిషాల OG, 100 ఎస్ఎంఎస్, 24 గంటలూ కాల్ చేసుకునే వెసలు బాటు ఉంటుంది.

    రూ. 2,997
    వ్యాలిడిటీ: 365 రోజులు
    2GB, 100 నిమిషాలు IC+ OG( భారత్+ లోకల్), 20 ఎస్ఎంఎస్ ఇన్ ప్లైట్ -250MB, 100 నిమిషాల OG, 100 SMS, 24 గంటల చెల్లుబాటు..( ఎంచుకున్న అంతర్జాతీయ విమాన సర్వీస్ లు).